ETV Bharat / state

రూ.20కే కమ్మని భోజనం.. ఎక్కడో తెలుసా..! - ఈస్వర్​ ఛారిటీస్​ వార్తలు

Eswar Charity food for Rs.20: ఈరోజుల్లో ఏ హోటల్లో భోజనం చేసినా వంద రూపాయలకు తక్కువ కాదు.. అంత ఖర్చు చేసినా రుచికరమైన, ఆరోగ్యమైన భోజనం లబిస్తుందా అంటే.. అదీ కూడా కష్టం. అందుకే సరైన భోజనం లభించక అవస్థలు పడుతున్న వారి కోసం ఈశ్వర్​ ఛారిటీస్​ పేరుతో చక్కనైన, కమ్మనైన భోజనం అందిస్తున్నారు. మంచి భోజనం అంటున్నారు.. కాస్ట్​లీ ఉంటుందనుకుంటున్నారా.. అదేమీ కాదండి.. కేవలం రూ.20కే భోజనం అందిస్తున్నారు నిర్వాహకులు.

vijayawada
melas for 20
author img

By

Published : Nov 20, 2022, 9:11 PM IST

Tasty Food for Rs.20: విజయవాడ నగరంలో ఒక ప్లేట్‌ భోజనం తినాలంటే కనీసం రూ.100కు పైనే వెచ్చించాలి. కేవలం రెండు ఇడ్లీ తిన్నా కనీసం రూ.30 పైనే ఉంటుంది. కానీ.. కేవలం రూ.20కే కడుపు నిండా అన్నం పెట్టే భోజనశాల విజయవాడలో ఉందనే విషయం చాలామందికి తెలియదు. ఇద్దరు దాతలు కలిసి ఈశ్వర్‌ ఛారిటీస్‌ పేరుతో ఏర్పాటు చేశారు. ఒక్కో ప్లేట్‌ భోజనానికి వారికి రూ.60 ఖర్చవుతోంది. రకరకాల పోటీ పరీక్షల కోసం విజయవాడలో ఉంటున్న యువత, పలు రకాల పనులపై వచ్చే గ్రామీణ ప్రాంత ప్రజలు, ఉద్యోగులకు ఈ భోజనశాల ఆకలి తీరుస్తోంది.

కమ్మనైన భోజనం

విజయవాడలో శిఖామణి సెంటర్‌ ఆసుపత్రులు, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం. ఇక్కడ సొంత భవనమే కావడంతో అద్దె కూడా ఉండదు. సేవాభావం ఉన్న ఐదుగురు ఉద్యోగులను ఏర్పాటు చేసుకున్నారు. ఒక దాతకు సంబంధించిన సోదరి ఈ భోజనశాల నిర్వహణ మొత్తం చూసుకుంటున్నారు. రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3గంటల వరకు తెరిచి ఉంటుంది. ఉదయం 8 నుంచి ఆరంభించి.. ఆహారం అంతా సిద్ధం చేస్తారు. ఈ భోజనశాల వద్ద కనీసం రూ.20కే భోజనం అనే బోర్డు కూడా ఉండదు. ఏ సమయంలో వచ్చినా.. ఆహారం వేడివేడిగానే వడ్డిస్తుండడం వీరి ప్రత్యేకత.

ప్రధానంగా రెండు మూడు కూరగాయలతో కూడిన కూర, ఒక కప్పు నిండా అరకిలో అన్నం, సాంబారు, మజ్జిగ అందిస్తున్నారు. వీటితో పాటు రోజూ తప్పకుండా ఏదో ఒకరకం రోటి పచ్చడి తయారుచేసి పెడుతున్నారు. వాము కలిపిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా ఇస్తున్నారు. .

ఈ భోజనశాలలో పనిచేసే వారి దగ్గర నుంచి వినియోగించే వస్తువుల వరకు అన్నింటినీ బాగా శుభ్రం చేస్తున్నారు. ప్రధానంగా ప్లేట్‌లో అన్నం వడ్డించే ముందు వేడి నీటిలో కడిగి పెడుతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక పరికరం కొనుగోలు చేసి ఉంచారు. అలాగే నిత్యం రోటి పచ్చడి చేయడానికి.. పాత పద్ధతిలోనే రోలు కూడా ఉంది. వడ్డించేటప్పుడు ఉద్యోగులు కూడా చేతులకు గ్లౌజులు తొడుక్కునే ఉంటారు. ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సేవాభావంతో ఆహారం అందిస్తున్నారని తెలిసి, తిన్న తర్వాత అభినందించి వెళుతున్నారు.

ప్రారంభించిన నుంచి ఇక్కడే తింటున్నా..: నేను వీఎఫ్‌ఎక్స్‌ కోర్సు నేర్చుకునేందుకు విజయవాడకు వచ్చా. ఈ భోజనశాల ప్రారంభించిన నుంచి ఇక్కడే తింటున్నా. ఆహారం చాలా బాగుంటుంది. మా ఇంటిలో తిన్నట్టే ఉంటుంది. అందుకే.. మధ్యాహ్న భోజన సమయానికి ఎంత దూరంలో ఉన్నా ఇక్కడికే వచ్చి తింటాను., అందుకే ఇక్కడ తింటే మాకు ఏం కాదనే ధైర్యం ఉంటుంది. - జోయల్‌, వీఎఫ్‌ఎక్స్‌ విద్యార్థి, రాజమహేంద్రవరం

జోయల్‌

ఆహారం చాలా బాగుంది..: పనిమీద విజయవాడ వచ్చా. ఆహారం చాలా బాగుంది. మా ఇంటిలో వండుకున్నట్టే.. పెద్దగా మసాలాలు, కారాలు లేకుండా ఉంది. కేవలం రూ.20 కే భోజనం అందించడం చూసి ఆశ్చర్యపోయా. పోషకాలతో కూడిన పదార్థాలే అన్నీ ఉన్నాయి. - ఎస్‌.కె.ఉద్ధండు, రైతు, నందిగామ

ఎస్‌.కె.ఉద్ధండు

ఒకసారి వచ్చా.. అప్పటి నుంచి ఇక్కడే..: నేను బ్యాంకులో పనిచేస్తున్నా. స్నేహితుల ద్వారా తెలిసి ఒకసారి వచ్చా. అప్పటి నుంచి ఇక్కడికే వస్తున్నా. బ్యాంకు ఇక్కడి నుంచి కొద్దిగా దూరంగానే ఉంటుంది. కానీ.. ఒకసారి వచ్చి తిన్నాక.. ఇక బయట ఎక్కడా తినాలని అనిపించడం లేదు. బ్యాచిలర్స్‌గా ఉన్న సమయంలో మాలాంటి వారికి ఇలా ఇంటి భోజనం దొరకడం అదృష్టమే. - మధు, బ్యాంకు ఉద్యోగి

ప్రస్తుతం రోజుకు వంద మందికి.. : మాకు వీలైనంత మందికి నాణ్యమైన ఇంటి భోజనం అందించాలనే లక్ష్యంతోనే ఈ భోజనశాలను ఏర్పాటు చేశాం. రోజూ ముందే ఏమి మెనూ సిద్ధం చేయాలనేది నిర్ణయించుకుని, దానికి తగ్గట్టుగా కూరగాయలు మార్కెట్‌ నుంచి తీసుకొస్తాం. ప్రస్తుతం రోజూ వంద మంది వరకూ వస్తుంటున్నారు. - మాధవి, హోటల్‌ నిర్వాహకురాలు

మాధవి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.