ETV Bharat / state

Dussehra Sharannavaratri Celebrations on Indrakiladri: ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. భద్రత పెంపు.. అదనపు బస్సులు ఏర్పాటు

Dussehra Sharannavaratri Celebrations on Indrakiladri: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆరో రోజు మూలా నక్షత్రం కానున్న నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో రానున్నారు. అమ్మవారిని సీఎం జగన్ దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను సీపీ కాంతి రాణా టాటా పరిశీలించారు.

dussehra_sharannavaratri
dussehra_sharannavaratri
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 19, 2023, 7:59 PM IST

Dussehra Sharannavaratri Celebrations on Indrakiladri: విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మవారు రోజుకో అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు మహాచండిగా దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తోంది. చండీ కవచం చదువుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఆరో రోజున అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతి శక్తి స్వరూపాలతో దుష్టసంహారం చేసిన తర్వాత దుర్గాదేవిని శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతీదేవిగా అలంకరిస్తారు. ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా విద్యార్థులు సర్వ విద్యల్లో విజయం సాధిస్తారని నమ్మకం.

CM Jagan will visit Indrakiladri Kanakadurga Goddess: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రేపు మూలా నక్షత్రం కానున్న నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం ప్రభుత్వం తరఫున సీఎం జగన్‌ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

Huge Devotees in Vijayawada Indrakiladri: ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు.. దర్శనం ఆలస్యంపై భక్తుల తీవ్ర అసహనం

CP Kanti Rana Inspected Security Arrangements on Indrakiladri: రేపు మూలానక్షత్రం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భద్రతా ఏర్పాట్లను సీపీ కాంతి రాణా టాటా పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ దసరాలో భాగంగా రేపు మూలానక్షత్రం రోజున అమ్మవారి దర్శనార్ధం మూడు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. భక్తుల రద్దీ ద్రుష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నామన్నారు. కొండపైన ఏ పాస్​లు ఉన్నా అనుమతించమని స్పష్టం చేశారు. ప్రోటోకాల్, వీఐపీలకు దర్శనాలు రేపు ఉండవు తెలిపారు. వినాయకుని గుడి నుంచి భక్తుల క్యూలైన్ల ద్వారానే భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం సజావుగా చేయించడమే తమ లక్ష్యమన్నారు.

Bus Stops Become Crowded with Passengers During Dussehra: దసరా పండుగకు ఊరెళ్లే ప్రయాణికులతో ప్రయాణప్రాంగణాలు రద్దీగా మారాయి. విజయవాడ నుంచి కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు వెళ్లే వారితో రైల్వే స్టేషన్ సహా పండిట్ నెహ్రూ బస్టేషన్ కిక్కిరిసింది. ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మను నవరాత్రుల్లో దర్శించుకునేందుకు పలు ప్రాంతాల నుంచి భక్తులు రాకపోకలు సాగిస్తుండటంతో రద్దీ మరింత పెరిగింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర పొరుగు రాష్ట్రాలకు రద్దీ దృష్ట్యా అదనపు బస్సులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

Impatience With Indrakiladri Lift Operators : ఇంద్రకీలాద్రి లిఫ్ట్‌ ఆపరేటర్ల తీరుపై విమర్శలు.. మహిళలను బలవంతంగా బయటకు తోసేసిన సిబ్బంది

శ్రీకాకుళం, విజయనగరం, ఉభయగోదావరి జిల్లాలతోసహా రాయలసీమ జిల్లాలకు అదనపు బస్సులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ చార్జీలనే వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రేపు మూలా నక్షత్రం కావడంతో కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ స్థాయిలో భక్తులు పలు ప్రాంతాల నుంచి బెజవాడకు వస్తారు. రద్దీ విపరీతంగా ఉంటుందని అంచనా వేసుకుని అదనంగా బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ముందస్తుగా టికెట్ రిజర్వేషన్ చేసుకోవాలని, అందుకు అనుగుణంగా రద్దీని అంచనా వేసి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని అధికారులు కోరారు.

Jagan Promise on Kanakadurga Temple Development not Fulfilled: ఇంద్రకీలాద్రి అభివృద్ధి అబద్ధమేనా.. హామీలను గాలికొదిలేసిన సర్కారు

Collector Delhi Rao Inspections on Indrakiladri: విజయవాడ ఇంద్రకీలాద్రి లడ్డూ ప్రసాదం తయారీ కేంద్రాన్ని కలెక్టర్ ఢిల్లీ రావు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. లడ్డూ ప్రసాద నాణ్యతను పరిశీలించి అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. దుర్గమ్మను దర్శించుకున్న ప్రతి భక్తుడికి లడ్డూ ప్రసాదం అందించాలనే తమ లక్ష్యమన్నారు. రేపటి నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారన్నారు. వారందరి కోసం 4 లక్షల లడ్డూలు ముందుగానే సిద్ధంగా ఉంచామని తెలిపారు. వచ్చిన ప్రతి భక్తుడికి అడిగినన్ని లడ్డూలు ఇస్తామన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ఆదేశించామన్నారు. ఎవరైనా ప్రసాదాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఢిల్లీరావు హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.