ETV Bharat / state

'అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అరెస్టు.. కొరియర్ ద్వారా విదేశాలకు సరఫరా'

drug gang in Rachakonda: తెలంగాణలోని హైదరాబాద్​ రాచకొండలో సోమవారం ఉదయం పట్టుకున్న అంతర్జాతీయ డ్రగ్స్​ ముఠా సభ్యులు చెన్నై వాసులుగా గుర్తించామని రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ పేర్కొన్నారు. ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. ముఠాకు సంబంధించి విస్తుపోయే వాస్తవాలు వివరించారు.

రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​
రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​
author img

By

Published : Dec 12, 2022, 5:43 PM IST

drug gang in Rachakonda: సోమవారం ఉదయం హైదరాబాద్​లోని రాచకొండ కమిషనరేట్​ పరిధిలో పట్టుకున్న అంతర్జాతీయ డ్రగ్స్​ ముఠాపై రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ మీడియా సమావేశం నిర్వహించారు. ముఠాకు సంబంధించిన వారందరూ చెన్నై వాసులుగా గుర్తించామని తెలిపారు. వారి దగ్గర నుంచి 8 కిలోల డ్రగ్స్​ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్​ విలువ రూ. 9 కోట్లు ఉంటుందని ప్రకటించారు. ఒక్కో గ్రాము రూ.10 వేలకు విక్రయిస్తున్నట్లు నిందితులు తెలిపారని ఆయన వివరించారు.

హైదరాబాద్​ నుంచి కొరియర్​ ద్వారా విదేశాలకు డ్రగ్స్​ సరఫరా చేస్తున్న ఈ ముఠా.. కాటన్​ వస్త్రాలుగా ఎగుమతి చేస్తున్నట్లు వివరించారు. నిందితులు నుంచి రూ. 4 లక్షలు, 9 చరవాణులు, 5 పాస్​పోర్టులు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ మహేశ్​ భగవత్​ తెలిపారు. ఇందులో చాకచౌక్యంగా వ్యహరించిన పోలీసులకు ఆయన అభినందనలు తెలియజేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.