Jada Sravan Kumar Comments: వైకాపా ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు ప్రచారం చేస్తోందని.. జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్ విమర్శించారు. మూడేళ్లలో ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారో.. ఎన్ని ఉద్యోగాలు కల్పించారో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మూడు రాజధానుల బిల్లుపై సుప్రీంకోర్టుకు వెళ్లే నైతిక హక్కు జగన్ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. ఒక ప్రభుత్వం చేసిన చట్టాన్ని మరో ప్రభుత్వం రద్దు చేయడం ఏంటన్నారు. ప్రభుత్వాల వైఖరికి రైతులు బలైపోవాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ ప్రభుత్వానికి చేతనైతే విశాఖలో ల్యాండ్ పూలింగ్ లేకుండా భూములు సేకరించాలన్నారు. అమరావతిలో రైతులు వేల ఎకరాలు రూపాయి తీసుకోకుండా.. రాష్ట్ర రాజధాని కోసం ఇచ్చారని గుర్తు చేశారు. కర్నూలుకు హైకోర్టుని రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా తరలిస్తుందని ప్రశ్నించారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఫుల్ కోర్టు ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు కొలీజియంకు పంపిస్తే.. ఇపుడు హైకోర్టును ఎలా కర్నూలుకు తరలిస్తారని అడిగారు. ఒక్క న్యాయమూర్తి కూడా హైకోర్టు తరలింపుకు ఆమోదం తెలుపకుండా తరలించడం సాద్యం కాదన్నారు. సీఎం జగన్ పాలన దుర్మార్గంగా ఉందని విమర్శించారు. రాజధాని అంశంలో సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలన్నారు.
ఇవీ చదవండి: