Controversy on AP CMO official X account: సీఎం కార్యాలయం అధికారిక సామాజిక మాద్యమ ఖాతా అంటే చాలా హూందాగా ఉండాలి. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కేవలం సీఎం నిర్ణయాలు మాత్రమే ప్రతిభింభించాలి. ముఖ్యమంత్రి తీసుకునే అధికారిక నిర్ణయాలు, సీఎం హోదాలో పాల్గొనే కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం అందించడం వరకు ఆ ఖాతా బాధ్యత. అదే ఖాతా పార్టీ రంగు పూసుకుంది. నెటిజన్ల నుంచి అదే స్థాయిలో రియాక్షన్ వస్తోంది.
సీఎంవో ఖాతాలో నుంచి పోస్టు: ఎపీ సీఎంవో అధికారిక ఎక్స్ ఖాతాను ఏకంగా పార్టీ కార్యక్రమాలకు వాడేస్తోన్న తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు ఇది సీఎంవో ఖాతానా...? పార్టీ ఖాతానా అని నిలదీస్తున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైకాపా విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ అధినేత హోదాలో ముఖ్యమంత్రి హాజరయ్యారు. పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. ముఖ్యమంత్రి పలానా కార్యక్రమంలో పాల్గొన్నారని అని సీఎంవో ఖాతాలో నుంచి ఒకవేళ పోస్టు వెలువడి ఉంటే నెటిజన్లు పెద్దగా పట్టించుకునేవారు కాదేమో.. పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు మొదలు, పార్టీ శ్రేణులు, వారు మాట్లాడుతున్న ఫొటోలు, భోజనాలు, చేస్తున్న ఫొటోలను సైతం సీఎంవో అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
మూడు రంగుల్లో ట్విట్టర్ వెరిఫికేషన్ టిక్.. ఎవరికి ఏ కలర్ ఇస్తారంటే?
సీఎంవో ఖాతాను ఐప్యాక్ టీమే హ్యాండిల్ చేస్తున్నారా?: ఏపీ సీఎం ఫేస్ బుక్ ఖాతాలోనూ ఇలాంటి ఫొటోలే కొన్ని దర్శనమిచ్చాయి. ఈ పోస్టులు చూసిన వారికి ఒక క్షణం వైకాపా ఎక్స్ హ్యాండిలే చూస్తున్నామేమో అనే ఫీలింగ్ కలిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంతలా పార్టీ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలతో నింపేశారు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఏ అకౌంట్ నుంచి ఎలాంటి పోస్టులు పెట్టాలో తెలీదా.. అని సీఎంవో అకౌంట్ అనుకుంటున్నారా.. పార్టీ ఖాతా అనుకుంటున్నారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఖాతాను కూడా బహుశా ఐప్యాక్ టీమే హ్యాండిల్ చేస్తోందనుకుంటా... అని మరో యూజర్ కామెంట్ లో పెట్టారు. మరో నెటిజన్ ఓ అడుగు ముందుకు వేసి... అధికారులు వైసీపీ కార్యకర్తలుగా మారిపోయారేమో అంటూ వ్యంగ్యంగా విమర్శలు గుప్పించాడు. ఓ వైపు నెటిజన్లు తిట్ల వర్షం కురిపిస్తున్నా.. ఎపీ సీఎంవో ఖాతా నుంచి ఈ పోస్టులను డిలీట్ చేయలేదు. ఏపీ సీఎంఓ అధికారిక ఎక్స్ (X) ఖాతాను ఏకంగా పార్టీ కార్యక్రమాలకు వాడేస్తున్న తీరుపై నెటిజన్లు, ప్రజలు మండిపడుతున్నారు. అసలు ఇది సీఎంఓ ఖాతానా? పార్టీ ఖాతానా? అంటూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.