ETV Bharat / state

ట్యాబ్‌ల బిల్లులకు బ్యాంకు గ్యారెంటీ - ఆ గుత్తేదారులపై సీఎం వల్లమాలిన ప్రేమ - AP Govt Distribute Free Tabs to Students

CM Jagan Tabs Scam: పాఠశాలల్లోని విద్యార్థులకు ట్యాబ్‌లు సరఫరా చేసే గుత్తేదారుల బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ ఇస్తోంది. ఇదే విధానంలో తమకూ బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలని.. ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌, స్మార్ట్‌ టీవీల సరఫరాదారులు కోరినప్పటికీ.. ఆ దస్త్రాన్ని మూలకునెట్టేసింది.

CM_Jagan_Tabs_Scam
CM_Jagan_Tabs_Scam
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 28, 2023, 12:25 PM IST

ట్యాబ్‌ల బిల్లులకు బ్యాంకు గ్యారెంటీ - ఆ గుత్తేదారులపై సీఎం వల్లమాలిన ప్రేమ

CM Jagan Tabs Scam: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ట్యాబ్‌లు సరఫరా చేసే.. గుత్తేదారులపై ప్రభుత్వం వల్లమాలిన.. ప్రేమ కురిపిస్తోంది. కాంట్రాక్టులు దక్కించుకున్న ఇద్దరూ ప్రభుత్వానికి కావాల్సిన వారే అవడంతో.. బిల్లుల చెల్లింపులకు బ్యాంకు గ్యారెంటీ ఇస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు.. ట్యాబ్‌లు సరఫరా చేసే కాంట్రాక్టులను రెండు సంస్థలు దక్కించుకున్నాయి. అందుకో ఒక గుత్తేదారు సకల శాఖలమంత్రి కాగా.. మరొకరు కీలక మంత్రికి బాగా కావాల్సిన వారే.

Govt Bank Guarantee for Tabs Bills: ట్యాబ్‌ల సరఫరా కోసం ప్రభుత్వం వీరిద్దరికీ చెల్లించాల్సిన బిల్లులకు బ్యాంకు గ్యారంటీ.. ఇస్తోంది. దీనికి సంబంధించిన పనుల్ని వాయువేగంతో పూర్తి చేసేసింది. ఇదే విధానంలో తమకూ బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలని.. ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌, స్మార్ట్‌ టీవీల సరఫరాదారులు కోరినప్పటికీ.. ఆర్థికశాఖ ఆ దస్త్రాన్ని మూలకునెట్టేసింది.

సీఎం సభకు వచ్చి ఇబ్బందుల్లో విద్యార్థులు.. ముందే ట్యాబ్​ల పంపిణీ

AP Govt Distribute Free Tabs to Students: గతేడాది ట్యాబ్‌లు సరఫరా(Tabs Supply) చేసిన వ్యక్తికే ఈసారీ కట్టబెట్టాలని సకల శాఖల మంత్రి, మరో కీలక మంత్రి ప్రయత్నాలు చేశారు. కానీ ఓ కీలక అధికారి వ్యతిరేకించడంతో టెండర్లు నిర్వహించక తప్పలేదు. ఇప్పుడు గుత్తేదార్లకు.. ఒక్క నెలలోనే 750 కోట్ల రూపాయలు చెల్లించేందుకు ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ.. ఇవ్వబోతోంది.

Tabs Distribute to Students in AP: ఆ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌(AP School Education Principle Secretary Praveen Prakash) ఈ నెల 16న రాసిన.. లేఖకు జ్యుడీషియల్‌ ప్రివ్యూ కమిటీ.. ఆమోదం తెలిపింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిల్లుల చెల్లింపు(Payments of Bills)పై బ్యాంకు గ్యారంటీ కావాలని.. ట్యాబ్‌ల గుత్తేదార్లు కోరడమే తడవుగా దస్త్రం చకచకా కదిలింది. రివర్స్‌ టెండరింగ్‌లో.. ఒక్కో ట్యాబ్‌ను 15వేల 800 రూపాయలకు సరఫరా చేసేందుకు అంగీకరించిన గుత్తేదార్లు.. బిల్లుల చెల్లింపులకు బ్యాంకు గ్యారంటీ ఇస్తే ధర తగ్గిస్తామనే మెలిక పెట్టారు.

CM Jagan to Distribute Tabs to Students: ప్రభుత్వం సరే అనడంతో గుత్తేదార్లు చివరికి 14వేల 200 రూపాయలకు సరఫరా చేయాలని నిర్ణయించారు. గతేడాది ఒక్కో ట్యాబ్‌ 13వేల 800 రూపాయలకు సరఫరా చేయగా.. ఈసారి ధర పెరిగింది. జగన్‌ జన్మదినం(CM Jagan Birthday Celebrations) సందర్భంగా డిసెంబరు 21న.. ట్యాబ్‌లను పంపిణీ చేయాలని నిర్ణయించారు. జనవరి 21 లోగా ప్రభుత్వం బిల్లులు చెల్లించాలి. ఒకవేళ చెల్లించకపోతే ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిన బ్యాంకు నుంచి.. గుత్తేదార్లు నగదును తీసుకునే అవకాశం కల్పించారు.

బడుల్లో బైజూస్ పాఠాలు.. ఏటా ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.