CM Jagan Rush for Skill Universities: తిరుపతి, విశాఖపట్నం జిల్లాల్లో స్కిల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసి, నిరుద్యోగులకు ఉద్యోగాలు సాధించేలా శిక్షణిస్తామంటూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 30 శాతం యువత ఆశలపై నీరు చల్లారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 నైపుణ్య కళాశాలలను ఏర్పాటు చేస్తామని గొప్పగా చెప్పిన సీఎం.. నాలుగున్నరేళ్లు దాటినా ఒక్కటీ కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో నిరుద్యోగులు, యువత సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
CM Jagan on Skill Development Universities: రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని.. దానికి అనుబంధంగా ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఒక నైపుణ్య కళాశాల ఏర్పాటు చేయాలని 2019 డిసెంబర్ 18న సమీక్షలో సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ఇంజినీరింగ్, డిప్లొమా పూర్తి చేసిన వారికి వర్సిటీ, స్కిల్ సెంటర్లు అండగా ఉంటాయని, అక్కడ మంచి సదుపాయాలు కల్పించి, బోధకులను నియమించాలని దిశానిర్దేశం చేశారు. ఇలా నైపుణ్య విశ్వవిద్యాలయాలు.. కళాశాలల ఏర్పాటుతో యువతకు విరివిగా నైపుణ్య శిక్షణ, విస్తృతంగా ఉద్యోగావకాశాలు, వేలల్లో జీతాలు వస్తాయంటూ నిరుద్యోగులను ఆశల పల్లకిలో విహరింపజేసిన సీఎం జగన్.. ఆ తర్వాత ఆ మాటలను గాలికి వదిలేశారు.
Jagan Announcement on 30 Skill Universities: లోక్‌సభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25, పులివెందులతో పాటు నాలుగు ట్రిపుల్ ఐటీల్లో మరో అయిదింటితో మొత్తం 30 నైపుణ్య కళాశాలలు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఒక్కో కళాశాల ఏర్పాటుకు రూ.20 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. 2019లో అప్పటి స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ ఛైర్మన్ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో హరియాణాలోని విశ్వకర్మ, రాజస్థాన్‌లోని భారతీయ, ఒడిశాలోని సెంచూరియన్ వర్సిటీలను లక్షల రూపాయలు వెచ్చించి పరిశీలించారు. తిరుపతిలో నైపుణ్య విశ్వవిద్యాలయం, కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన విశాఖలో హైఎండ్ వర్సిటీ ఏర్పాటు చేసి.. బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ కోర్సులు నిర్వహిస్తామని ఆశలు కల్పించారు. కానీ, ఇంతవరకు పులివెందులలో తప్ప ఎక్కడా భవనాలు నిర్మించలేదు. ట్రిపుల్ ఐటీల్లో ఏర్పాటు చేస్తామన్న నాలుగింటినీ అటకెక్కించేశారు.
PATTABHI ON SKILL DEVELOPMENT : స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో.. అది అవాస్తవం: పట్టాభి
Skill Centers Started During TDP Regime: రాష్ట్రంలో ఏటా దాదాపు 1.30 లక్షల మంది విద్యార్థులు డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తి చేస్తుండగా, 40 శాతం మంది ప్రాంగణ నియామకాల్లో ఎంపికవుతున్నారు. మిగిలిన 60 శాతం మందికీ ఉద్యోగ నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు తెలుగుదేశం హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే, వైసీపీ సర్కారు వాటిని మూసివేసింది. ప్రత్యేకంగా నైపుణ్య కళాశాలలు ఏర్పాటు చేస్తామని ఘనంగా చెప్పినా.. నిధులు లేవంటూ ప్రతిపాదనలన్నీ మూలకు పడేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలల్లోనే ఏపీ రాష్ట్ర ఉద్యోగ కల్పన, వ్యవస్థాపకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం కేంద్రం డీడీయూజీకేవై కింద ఒక్కో విద్యార్థికి రూ.30 వేల నుంచి రూ.40 వేలు ఇస్తుండగా.. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటోంది. మరోవైపు తగినన్ని నైపుణ్య కళాశాలలు లేకపోవడంతో ఏటా శిక్షణ పొందుతున్న విద్యార్థులు 15 వేల మందికి మించడం లేదు.
30 Percent People did Not Get Jobs: రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26 నైపుణ్య కళాశాలల్లో ఇప్పటి వరకు 1,401 మంది శిక్షణ పొందగా, వీరిలో దాదాపు 30 శాతం మందికి ఉద్యోగాలే లభించలేదు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎంఎస్‌ఎంఈ కేంద్రంలో ఏర్పాటు చేసిన నైపుణ్య కళాశాలలో ప్రస్తుతం శిక్షణ ఇవ్వడం లేదు. గతంలో ఇక్కడ శిక్షణ పొందిన 90 మందికి హైదరాబాద్, చెన్నై సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభించినా.. తక్కువ జీతానికి పని చేయలేక చాలామంది చేరలేదు. కర్నూలులో శిక్షణ పొందిన 30 మందిలో చాలామంది జ్యువెలరీ దుకాణాల్లో 10 వేల నుంచి 15 వేల వేతనంతో సేల్స్ సూపర్‌వైజర్ ఉద్యోగాలు పొందారు.
ఇంజినీరింగ్ విద్యార్థులకు.. సీ - డాక్ ఆన్లైన్ శిక్షణ
Nandyalu District: నంద్యాలలో శిక్షణ పూర్తి చేసుకున్న 60 మందికి ఇంతవరకు ఉద్యోగాలు లభించలేదు. ఆచార్య నాగార్జున వర్సిటీ పరిధిలో ఆటోక్యాడ్, ప్రొడక్టు డిజైన్ తదితర టెక్నికల్ కోర్సుల్లో ఇప్పటివరకు 90 మంది శిక్షణ పూర్తి చేసుకోగా.. 20 మంది వివిధ కారణాలతో ఉద్యోగాల్లో చేరలేదు. విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ మారిటైం, షిప్‌బిల్డింగ్ లోని నైపుణ్య కళాశాలలో 82 మంది శిక్షణ పొందినా ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో పేషెంట్ రిలేషన్స్ అసోసియేట్, సేల్స్ సూపర్‌వైజర్, స్పెషలైజ్‌డ్ స్యూయింగ్ మిషన్ ఆపరేటర్, ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్ వంటి కోర్సుల్లో 110 మంది శిక్షణ పొందగా, 72 మందికి ఉద్యోగాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.
Eluru, Nellore Districts: ఏలూరులో సేల్స్ అండ్ రిటైల్, పీఎం లంకలో ఫోర్‌మెన్ ఎలక్ట్రికల్, ఆక్వాకల్చర్ టెక్నికల్ సూపర్‌వైజర్ కోర్సుల్లో శిక్షణ పొందిన 60 మందిలో 40 మంది కొలువులు పొందినా.. జీతాలు తక్కువని చాలా మంది మానేశారు. సేల్స్ అండ్ రిటైల్ శిక్షణ తప్ప కొత్త కోర్సులు లేవని విద్యార్థులు వాపోతున్నారు. నెల్లూరులోని కేంద్ర ఐఐటీటీఎం కళాశాలలో శిక్షణ పొందిన 90 మందిలో 78 శాతం మందికి ఉద్యోగాలు లభించినా, జీతాలు తక్కువగా ఉన్నాయి. అనంతపురంలో శిక్షణ పొందిన 30 మందిలో 14 మందికే ఉద్యోగాలు వచ్చాయి.