ETV Bharat / state

జొన్నలగడ్డ పద్మావతికి సీఎంఓ పిలుపు - జగన్​ నిర్ణయంపై ఉత్కంఠ - సీఎం జగన్ తో పద్మావతిభేటీ

CM Jagan met Singanamala MLA Jonnalagadda Padmavathi: శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో పాటుగా వెలంపల్లి శ్రీనివాస్‌, ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. టికెట్ కేటాయింపులు తదితర అంశాలపై సీఎం జగన్, సజ్జలతో నేతలు భేటీ జరిగింది. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తీరుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

CM Jagan met Singanamala MLA Jonnalagadda Padmavathi

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 9, 2024, 5:27 PM IST

Updated : Jan 9, 2024, 6:49 PM IST

CM Jagan met Singanamala MLA Jonnalagadda Padmavathi: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. జగనన్నకు ఎదురు చెప్పలేరు, చంద్రన్నతో చేయి కలపలేరు అన్నట్లుగా తయారైంది వైఎస్సార్సీపీ మంత్రులు ఎమ్మెల్యేల పరిస్థితి. ఇన్నాళ్లు తానే అన్ని అనుకొని చెమటోడ్చిన నేతలకు మెుండిచేయి చూపుతున్నాడు జగనన్న. సర్వం జగనే అనుకొని వెంట నడిచిన నేతలకు కాళ్లకింద నీరు వచ్చేదాకా తెలియడం లేదు, తమను జగన్ మోసం చేశారని. ఈ సందర్భంగా సీఎం జగన్ నమ్ముకొని మోసపోయిన నేతలు తమ ఆవేదన సైతం చెప్పుకోవడానికి భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాజాగా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సీఎంఓ నుంచి ఫోన్ వచ్చింది. వైఎస్సార్సీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన ధిక్కార స్వరం వినిపిస్తున్న వారిని, బుజ్జగించడమో, లేదా వదిలేయడమో జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి విషయంలో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

High Court: పాఠశాలలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు:హైకోర్టు

నిన్నటి రోజున శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తన టికెట్ విషయమై ఫేస్ బుక్ లైవ్​లో తన ఆవేదన వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ గా మారింది. తనకు శింగనమల సీటు నిరాకరణపై వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై పద్మావతి విమర్శలు గుప్పించారు. ఎస్సీ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని ఆరోపించారు. ‘అందరికీ అణిగిమణిగి ఉండాలి. ఎవరినో సంతృప్తిపరచడానికి వాళ్ల కాళ్లు వీళ్ల కాళ్లు పట్టుకోవాలి. నీళ్లు ఇవ్వకపోయినా మాట్లాడకూడదు. పొరపాటున మాట్లాడితే అది పెద్ద నేరం’ అంటూ పద్మావతి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు సీఎం జగన్​ను కలవాలంటూ జొన్నలగడ్డ పద్మావతికి సీఎంఓ నుంచి పిలుపు అందింది. జగన్​తో భేటీ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై జగన్‌కు వివరణ ఇచ్చేందుకు పద్మావతి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి సీఎం జగన్‌తో భేటీ అయ్యారు.

పవన్ ఇంటికి​ టీడీపీ అధినేత చంద్రబాబు - జనసేన సీట్ల కేటాయింపు సహా ఎన్నికల వ్యూహంపై చర్చ

మరోవైపు మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో పాటుగా వెలంపల్లి శ్రీనివాస్‌, ఎంపీ గోరంట్ల మాధవ్‌లకు సీఎం జగన్‌ అపాయింట్‌మెంట్‌ ఇచ్చిన నేపథ్యంలో నేతలు నేడు సీఎంఓకు చేరుకున్నారు. ముగ్గురు నేతలతో భేటీలో సీట్ల కేటాయింపు అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎవ్వరికి సీటు కేటాయిస్తారు, ఎవ్వరికి నిరాకరిస్తారు అనే అంశంలో ఉత్కంఠ నెలకొంది. గోరంట్ల మాధవ్ టికెట్ విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో సీఎం జగన్​తో భేటీలో హిందూపురం ఎంపీ సీటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

TDP SC Cell Meet : మాల, మాదిగలను సమన్వయం చేసుకుంటూ సీట్ల కేటాయింపు : వర్ల రామయ్య

Last Updated : Jan 9, 2024, 6:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.