CM Jagan False Promises : 2020 ఆగస్టు12న మొదటి విడత చేయూత విడుదల సభలో జగన్ ఎన్నో గొప్పలు చెప్పారు. వైఎస్సార్ చేయూత కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో కిరాణా దుకాణాలు పెట్టిన మహిళల సంఖ్య లక్షా 10 వేలకు చేరిందని 2022 సెప్టెంబరు 23న మూడో విడత ఆర్థిక సాయం విడుదల చేసేటప్పుడు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
YSR Cheyutha Scheme Programme in AP : ఇందులో జగనన్న గొప్పల డప్పు తప్ప కొత్తగా చేసిందేమీలేదు. జగనన్న చేయూత కింద 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఏడాదికి 18వేల 750 రూపాయల చొప్పున 4 విడతల్లో 75 వేల రూపాయలు అందించాలి. ఐతే జీవనోపాధి ఏర్పాటు చేసుకునే వారికి బ్యాంకుల ద్వారా ఒకేసారి రూ.75 వేలు అందిస్తామని 2020లోనే ప్రకటించారు! అంటే బ్యాంకుల ద్వారా ప్రభుత్వం అప్పులు ఇప్పించడం, లబ్ధిదారులు వాయిదాల్లో తిరిగి బ్యాంకులకు చెల్లించడం జగన్ వచ్చాకే మొదలైందా? దాదాపు రెండు దశాబ్దాలుగా అదే జరుగుతోంది. లక్షలమంది డ్వాక్రా మహిళలు రుణాలు పొంది సుస్థిర స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకున్నారు.
పేరుకే కార్పొరేషన్లు.. బీసీలకు చేయూత ఏదీ...?
CM Jagan on Women Employment : ఇదంతా తన ఘనతేనంటూ జగన్ ప్రచారం చేసుకుంటున్నారు. మొదట్లో మండలానికి రెండు చేయూత దుకాణాలు ఏర్పాటు చేయాలని అనుకున్నారు. వాటిలో ఒకరు తప్పనిసరిగా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనే నిబంధన పెట్టారు. అది సాధ్యపడకపోవడంతో వెనక్కి తగ్గారు! 2వేల జనాభాకు ఒకటి చొప్పున రాష్ట్రం మొత్తం చేయూత దుకాణాలు ఏర్పాటు చేయాలనేది అప్పట్లో నిర్ణయం. బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే వాటికి 3శాతం మార్జిన్ ఉండేలా కార్పొరేట్ సంస్థలు తమ ఉత్పత్తులు అందించాలి. అమ్మకాలకు అనుగుణంగా వారానికి ఒకసారి సరకులు సరఫరా చేయాలి.
చేతులెత్తేసిన జగన్ : జగన్ మాటలను నమ్మి చేయూత కింద రిటైల్ వ్యాపారం ఏర్పాటు చేసుకుంటామని 2020 సెప్టెంబరు నాటికి లక్షా 71 వేల మంది ప్రభుత్వానికి సమ్మతి పత్రాలు అందించారు. కానీ అమల్లోకి వచ్చేసరికి జగన్ చేతులెత్తేశారు. మొదట్లో కొద్దోగొప్పో జరిగినా ఆ తర్వాత ఆగిపోయింది. చాలా తక్కువ దుకాణాలకు మాత్రమే కొన్ని సంస్థల నుంచి నామమాత్రంగా సరకులు అందుతున్నాయి. చిత్తూరు జిల్లాలో 18 వేల మంది కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకోగా ప్రస్తుతం ఒక్కదానికీ కార్పొరేటు సంస్థ నుంచీ సరకులు రావడం లేదు.
'నేను బతికే ఉన్నానయ్యా - చనిపోయినట్లు నమోదు చేసి పథకాలు ఆపేశారు'
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2వేల మంది వరకు దుకాణాలు ఏర్పాటు చేసుకుంటే ప్రస్తుతం ఒక్కదానికి కూడా ప్రభుత్వం చెప్పినట్లు సరకులు అందడం లేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొదట్లో 3,700 మంది మహిళలు కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకోగా ప్రభుత్వ సహకారం కొరవడి ఇప్పటికే రెండు వేల మంది మూసేశారు. మిగతా కొన్నింటికే పీఅండ్‌జీ, హిందుస్థాన్ లీవర్ సంస్థలు సరకులు సరఫరా చేస్తున్నాయి. నర్సీపట్నం పురపాలక సంఘం పరిధిలో మొదట్లో 80 మంది దుకాణాలు ఏర్పాటు చేస్తే ప్రస్తుతం 45 మందే మిగిలారు.
చేయూత దుకాణాలకు బ్రాండింగ్ కల్పించాలని, ఉత్పత్తులకు మార్కెటింగ్ చూపించాలన్న జగన్ ఆదేశాలు కూడా అతివలకు అక్కరకు రాలేదు. లబ్ధిదారుల సమస్యల పరిష్కారానికి షాపు వద్ద నంబరును ప్రదర్శించాలనీ ఆదేశిస్తారు. ఇవన్నీ నీటి మీద రాతల్లాంటివే! ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొందరు డ్వాక్రా మహిళలు గత ప్రభుత్వాల హయాంలోనే పలు ఉత్పత్తులు తయారుచేసి వాటికి బ్రాండ్‌లు తెచ్చారు. వారిలో కొందరు చేయూత నిధులు పొందడంతో వారినీ ఖాతాలో వేసుకున్నారు.
గత ప్రభుత్వ హయంలోనే ఏటికొప్పాక బొమ్మలను ఆన్‌లైన్, ఈ-కామర్స్ సైట్‌లలో ఉంచి అమ్మకాలు మొదలుపెట్టారు. ఈ క్రెడిట్‌ను వైఎస్సార్సీపీ సర్కారు తీసుకుంది. సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేక నంబరు ఉందనే విషయమే చాలామంది దుకాణాదారులకు ఇప్పటికీ తెలియదు. దుకాణాల ముందు ఆయా నంబర్లనే పెట్టడం లేదు.