Chandrababu visited Bachula Arjuna: తెలుగుదేశం ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడును విజయవాడ రమేష్ ఆసుపత్రిలో పార్టీ అధినేత చంద్రబాబు కలిసి పరామర్శించారు. బచ్చుల అర్జునుడుని ఈ పరిస్థితుల్లో చూడాల్సి రావటం బాధాకరమని చంద్రబాబు అన్నారు. మరో 2రోజులు గడిస్తే కానీ పరిస్థితిని వైద్యులు చెప్పలేరన్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో వైద్యం కొనసాగుతోందని పేర్కొన్నారు. విజయవాడ ఎప్పుడొచ్చినా విమానాశ్రయం వద్ద తనను తప్పనిసరిగా బచ్చుల కలిసేవారని గుర్తుచేశారు.
తారకరత్న పరామర్శకు వెళ్లే ముందు కూడా అర్జునుడు తనను కలిశారని.., ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించినట్లు తెలిపారు. అర్జునుడుని వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. అటు.... తారకరత్న ఆరోగ్య పరిస్థితి వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని.., ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. తారకరత్న కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని వెల్లడించారు.
ఒకరోజు ముందు నాతో చాలా విషయాలు మాట్లాడారు.. నేను కూడా ఒకటే చెప్పాను.. నువ్వు చాలా యాక్టివ్గా ఉన్నావు.. ఎక్కువగా తిరుగుతున్నావు.. నీ ఆరోగ్యం మీద కూడా కొంచెం దృష్టి ఉంచుకోమని చెప్పాను.. కాని ఆ తరువాత రోజే ఇలా జరగడం చాలా బాధాకరం.. డాక్టర్స్ అబ్సర్వ్ చేస్తున్నారు.. రెండు రోజులు గడిస్తే కాని రికవరీ అయ్యే దాని గురించి చెప్తామన్నారు.- చంద్రబాబు, తెలుగుదేశం అధినేత
ఇవీ చదవండి: