ETV Bharat / state

ఫోన్​కాల్స్ ​డేటా ఆధారంగా వైఎస్​ అవినాష్​రెడ్డిపై సీబీఐ ప్రశ్నలు - YS Avinash Reddy

YS Avinash Reddy : వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డిని సీబీఐ అధికారులు భిన్న కోణాల్లో విచారించారు. మొబైల్‌ కాల్‌డేటా ఆధారంగా ప్రశ్నల వర్షం కురిపించారు. ఆర్థిక లావాదేవీలపైనా ఆరా తీశారు. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని సూచించగా.. దానికి సమ్మతించినట్లు అవినాష్‌రెడ్డి తెలిపారు.

YS Avinash Reddy
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి
author img

By

Published : Jan 29, 2023, 7:06 AM IST

Updated : Jan 29, 2023, 1:57 PM IST

Ys Vivekananda Reddy Murder Case : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని సీబీఐ అధికారులు నాలుగున్నర గంటలపాటు విచారించారు. దిల్లీ నుంచి వచ్చిన ఎస్పీ రాంసింగ్‌ నేతృత్వంలోని దర్యాప్తు బృందం హైదరాబాద్‌ కోఠి కేంద్రీయ సదన్‌లోని సీబీఐ కార్యాలయంలో ప్రశ్నించింది. అవినాష్‌రెడ్డిని విచారించడానికి ముందు వివేకా హత్య జరిగిన సమయంలో దర్యాప్తు చేసిన కడప పోలీసులనూ సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఈ కేసులో ఇప్పటిదాకా నమోదు చేసిన వాంగ్మూల ఆధారంగా అవినాష్‌రెడ్డికి అధికారులు ప్రశ్నలు సంధించారు.

2019 మార్చిలో వివేకా హత్య జరగ్గా.. తొలుత గుండెపోటు వల్లే చనిపోయారంటూ ప్రచారం చేశారు. కేసు దర్యాప్తు క్రమంలో ఇప్పటివరకూ సేకరించిన సాక్ష్యాధారాలను ముందుంచి అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించినట్లు సమాచారం. ఎంపీ కాల్ డేటా వివరాలనూ ముందుంచి ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. వివేకా హత్య వెనుక కోట్లలో లావాదేవీలు జరిగాయనే ఆరోపణలపైనా దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. విచారణ అనంతరం అవినాష్​ రెడ్డికి మళ్లీ పిలిస్తే రావాలని సీబీఐ సూచించగా.. పూర్తిగా సహకరిస్తానని అవినాష్‌రెడ్డి తెలిపారు.

"సీబీఐ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను. నాకు తెలిసిన సమాచారమంతా అందించాను. అవి తెలపటం ఇప్పుడు మంచిది కాదు. అవసరమైతే మళ్లీ పిలుస్తామని అన్నారు. నేను దానిక ఒప్పుకున్నాను. ఎలాంటి సందేహలు ఉన్న నివృత్తి చేస్తానని చెప్పాను. విచారణ సమయంలో వీడియో రికార్డింగ్, నా తరపు న్యాయవాది సమక్షంలో విచారించాలని సీబీఐని కోరాను. వారు దానికి అంగీకరించలేదు." -వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైసీపీ ఎంపీ

మరోవైపు సీబీఐ కార్యాలయం వద్దకు వైఎస్సార్​ జిల్లా నుంచి అవినాష్‌ అనుచరులు పెద్ద ఎత్తున వెళ్లారు. అందులో రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ బృందం అవినాష్‌ విచారణ ముగిసేవరకూ అక్కడే ఉంది.

వైఎస్​ అవినాష్​రెడ్డిపై సీబీఐ ప్రశ్నలు

Last Updated : Jan 29, 2023, 1:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.