ETV Bharat / state

'గతంలో జీతం పెరిగితే సంతోషించేవాళ్లం.. కానీ ఇప్పుడు' - amaravati news

Bopparaju Venkateswarlu on Government: ఒకటో తేదీన జీతాలివ్వలేని దుస్థితి రాష్ట్రంలో తప్ప మరెక్కడా లేదని.. ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. జీతాలు సకాలంలో అందక ఉద్యోగులు, వారి కుటుంబాలకు తీవ్ర వేదనకు గురవుతున్నారని వాపోయారు. ఇవన్నీ పరిష్కరించకపోవడం వల్లే ఉద్యమానికి దిగినట్లు చెప్పారు.

Bopparaju Venkateswarlu
బొప్పరాజు వెంకటేశ్వర్లు
author img

By

Published : Apr 7, 2023, 2:14 PM IST

Updated : Apr 8, 2023, 6:24 AM IST

Bopparaju Venkateswarlu on Government: జీతాలు ఒకటో తేదీకి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. వేతనాలు, బకాయిలు ఇవ్వడంసహా పలు సమస్యల పరిష్కారం కోసం రెండో దఫా ఉద్యమ పోరాట కార్యాచరణ ప్రకటించినట్లు చెప్పారు. కార్యాచరణపై సీఎస్​కు నోటీసు అందించారు.

విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సీఎస్ జవహర్​రెడ్డిని కలిసిన ఎపీజేఎసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదర్​ సహా నేతలు నోటీసుతో పాటు 50 పేజీలతో కూడిన మెమోరాండంను అందించారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని కోరారు. తమది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ఉద్యమం కాదని.. ఉద్యోగ సంఘాల ఉనికి కోసం ఉద్యమం చేయట్లేదని.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమే ఉద్యమం చేస్తున్నామని తెలిపారు.

జీతాల విషయంలో ఒకట్రెండుసార్లు అయితే సరే కానీ.. ఇలాగే ఏళ్లుగా కొనసాగితే పరిస్థితి ఏంటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి జీతాలు రాక.. ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారని అన్నారు. సకాలంలో రుణాలు చెల్లించక.. బ్యాంకులు వడ్డీల మీద వడ్డీలు వేస్తున్నాయని తెలిపారు. రుణ యాప్‌ల ద్వారా డబ్బులు తీసుకుని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొస్తున్నారని అన్నారు. లెక్కలు చెప్పాలని అడిగితే ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదని.. కొత్త డీఏల ఊసే లేకుండా పోయిందని విమర్శించారు.

న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా రావాల్సిన జీతభత్యాలు ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు రాక ప్రభుత్వ ఉద్యోగులు కష్టాలు పడుతున్నారని.. బ్యాంకులకు ఈఎంఐలు చెల్లించలేక వడ్డీలు కట్టాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. తెలంగాణలో ఒక్క డీఏ కూడా పెండింగ్‌లో లేదని.. కానీ ఆంధ్రప్రదేశ్​లో ఆ ఊసే లేదన్నారు. గతంలో జీతం పెరిగితే సంతోషించేవాళ్లమని.. కానీ ఇప్పుడు జీతం పడితే సంతోషించాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. తమ పోరాటంలో కలిసి రావాలని ఏపీ ఎన్జీవో ఐకాసను కోరామని తెలిపారు. మాతో కలిసొచ్చినా.. లేక విడిగా పోరాటం చేసినా ఫర్వాలేదన్నారు.

జీతాలు రాక.. ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు: బొప్పరాజు

"మా జీతభత్యాలు కూడా రానివ్వకుండా.. మేము దాచుకున్న డబ్బులు కూడా ఎంత ఇచ్చారో, ఎంత చెల్లించారో కనీసం లెక్కలు కూడా చెప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉద్యమానికి రావల్సి వచ్చింది. జీతాలు ఎందుకు ఇవ్వలేక పోతున్నామో ఉద్యోగులకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా. దాని వలన ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రమైన బాధలు అనుభవిస్తున్నారు. మా కుటుంబాలు సంతోషంగా ఉంటేనే కదా.. మీరు చెప్పిన పనులు మేము చేయగలం. ఈఎంఐలు సకాలంలో కట్టడం లేదని.. మాకు బ్యాంకు వాళ్లు ఫైన్లు వేస్తున్నారు. దీనికి కారణం ప్రభుత్వం కాదా? మూడు నెలలుగా జీతాలు రాని ఉద్యోగులు కూడా ఉన్నారు. జీతం సకాలంలో రాక.. ఇంట్లో వైద్య ఖర్చులు, ఇతర ఖర్చులు భరించలేక.. లోన్ యాప్​ల ద్వారా అప్పులు తీసుకొని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని కల్పిస్తున్నారు.

డీఏ అరియర్స్, లెక్కలు సరిగ్గా చెప్పరు, కొత్త డీఏల పరిస్థితి అసలు ఊసేలేదు. తెలంగాణలో ఒక్క డీఏ కూడా పెండింగ్​లో లేదు. కానీ మన దగ్గర మాత్రం ఆర్థికంగా బాగానే ఉంది అంటారు.. కానీ డీఏలు ఇప్పటికీ సరిగ్గా ఇవ్వరు. పీఆర్సీ అరియర్స్.. తెలంగాణలో ఆల్రెడీ చెల్లిస్తోంది.. కానీ ఇక్కడ కనీసం లెక్కలు కూడా చెప్పని పరిస్థితి. నాలుగు సంవత్సరాలుగా పేస్కేల్స్​ కూడా ఇవ్వలేదు". - బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు

ఇవీ చదవండి:

Last Updated : Apr 8, 2023, 6:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.