ETV Bharat / state

అల్జీమర్స్​కి పుస్తక పఠనం ఔషధం- తణికెళ్ల భరణి - పుస్తక మహోత్సవంలోతణికెళ్ల

Book Festival Ending In Vijayawada: విజయవాడలో ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న 34వ పుస్తక మహోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటుడు తనికెళ్ల భరణి హాజరయ్యారు. పిల్లలను పుస్తకాలు చూడటం నుంచి చదవటం వైపు మళ్లించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని ఆయన సూచించారు. కొత్త తరానికి పుస్తకాలను, సాహిత్య విలువలను పరిచయం చేయడంలో పుస్తక మహోత్సవాలు పోషిస్తున్న పాత్ర ఆనందదాయకం అన్నారు.

Book_Festival_Ending_In_Vijayawada
Book_Festival_Ending_In_Vijayawada
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 8, 2024, 12:08 PM IST

అల్జీమర్స్​కి పుస్తక పఠనం ఔషధం- తణికెళ్ల భరణి

Book Festival Ending In Vijayawada: పిల్లలు పుస్తకం చూడటం నుంచి చదవడం వైపు మళ్లించాల్సిన బాధ్యత అందరిపై ఉందని రచయిత, సినీ నటుడు తనికెళ్ల భరణి అన్నారు. విజయవాడ పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న 34వ పుస్తక మహోత్సవం ముగింపు సభకు ముఖ్యఅతిథిగా తనికెళ్ల భరణి హాజరయ్యారు. ఈ సందర్భంగా తణికెళ్ల భరణి పుస్తక వైభవం, మనుగడపై చర్చించారు. మన పూర్వీకులు అపారమైన సాహిత్య నిధిని మనకు పుస్తకాల ద్వారా ఇచ్చి వెళ్లారని భరణి అభిప్రాయపడ్డారు. అక్షరం అంటే నాశనం లేనిది. పుస్తక పఠనం జీవితంలో భాగమని ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవటంతో పాటు, అన్వయించుకోవాలి అని సూచించారు. పిల్లలను పుస్తకాలు చూడటం నుంచి చదవటం వైపు మళ్లించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని తెలియజేశారు.

పుస్తక ప్రియులకు గుడ్​న్యూస్​ - విజయవాడలో పుస్తక మహోత్సవం

Tanikella Bharani Said Book Reading is Medicine for Alzheimers: ప్రస్తుతం విద్యార్థులు సాంకేతికత వైపు చూస్తూ పుస్తకాలను పెడచెవిన పెడుతున్నారని, అది మంచి పరిణామం కాదని భరణి స్పష్టం చేశారు. మంచి పుస్తకంలో ఒక పేజీ తీస్తే ప్రపంచానికి ఒక కొత్త కిటికీ తీసినట్లు అవుతుందన్నారు. మన పద్యం, సాహిత్యం ప్రపంచంలో ఏ దేశానికి లేదని స్పష్టం చేశారు. అల్జీమర్స్ వ్యాధికి పుస్తక పఠనం, పద్యం వలె వేయడం ఔషధమని కొనియాడారు. పుస్తకం ఉన్న ఇంటిని ఇల్లు అందాం లేని దానిని కొంప అందామని చమత్కరించారు.

విజ్ఞానవంతమైన సమాజాన్ని సృష్టించడంలో పుస్తకాలే కీలకం: కేంద్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్​

కరోనా సమయం ప్రతి ఒక్కరికీ పుస్తకాల వైపు మళ్లించిందని, మంచి పుస్తకం చక్కని సంస్కారాన్ని నేర్పుతుందని తణికెళ్ల భరణి తెలియజేశారు. కొత్త తరానికి పుస్తకాలు, సాహిత్య విలువలు పరిచయం చేయడంలో పుస్తక మహోత్సవం పోషిస్తున్న పాత్ర ఆనందదాయకంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రపంచంలో పిల్లలు మొబైల్ వ్యాధిగ్రస్థులుగా మారకుండా కాపాడుకునేందుకు పుస్తకాలను పరిచయం చేయాలని సూచించారు. పుస్తకాలతో స్నేహం దీర్ఘకాలిక ఆనందాన్నిచ్చే శాశ్వత బంధమని భరణి పేర్కొన్నారు.

Book Festival: విజయవాడలో 32వ పుస్తక మహోత్సవం.. ప్రారంభించిన గవర్నర్

చదువు పట్ల పిల్లలకు ఆసక్తి కలిగించేందుకు మహనీయుల జీవిత చరిత్రలు చదవించాలని చెప్పారు . జీవిత పరమార్థం కళ్ల ఎదుట ప్రత్యక్షం కావాలంటే 'అనుభవాలు-జ్ఞాపకాలు', 'నా జీవన యానం', 'హంపీ నుంచి హరప్పా దాకా' పుస్తకాలు చదవాలని సూచించారు. తెలుగు నేల మూడు ప్రధాన భాగాల సాంస్కృతిక వైభవాన్ని తెలుసుకోవడానికి ఈ మూడు పుస్తకాలు దోహద పడతాయని వివరించారు. పుస్తకాలు చదవడం వల్ల భిన్నాభిప్రాయాలను స్వీకరించడం, మానసిక వికాసం అభివృద్ధి చెందుతున్నారు. విజయవాడ పుస్తక మహోత్సవ సొసైటీ గత 18 సంవత్సరాలుగా మంచి గ్రంథాలయాన్ని నిర్వహించటమే కాక, మంచి పుస్తకాలు, సాహిత్యాన్ని ప్రజలకు అందించటానికి కృషి చేస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.