R.I. Aravind: మోటూరులో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని.. తమకు గుడివాడ తహశీల్దార్ నుంచి ఫోన్ వచ్చిందని ఆర్.ఐ.అరవింద్ తెలిపారు. వీఆర్‌ఏ, వీఆర్‌వోలను వెంటబెట్టుకుని మోటూరుకు వెళ్లానని.. జేసీబీ, మూడు ట్రాక్టర్లతో మట్టి తవ్వకాలు చేస్తున్నారని చెప్పారు. మట్టి తవ్వకాలను ఆపాలని హెచ్చరించినా వినకుండా.. తవ్వకాలు ఆపకుండా తమతో వాగ్వాదానికి దిగారని అన్నారు. అంతటితో ఆగకుండా.. తమపై దాడి చేశారని ఆర్.ఐ. అరవింద్ వాపోయారు. దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు వచ్చి 3 ట్రాక్టర్లు, జేసీబీ సీజ్ చేసినట్లు స్పష్టం చేశారు.
"మోటూరులో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని నాకు గుడివాడ తహశీల్దార్ నుంచి ఫోన్ వచ్చింది. వీఆర్‌ఏ, వీఆర్‌వోలను వెంటబెట్టుకుని మోటూరుకు వెళ్లాను. జేసీబీ, మూడు ట్రాక్టర్లతో మట్టి తవ్వకాలు చేస్తున్నారు. మట్టి తవ్వకాలను అపాలని హెచ్చరించా. తవ్వకాలు ఆపకుండా నాతో వాగ్వాదానికి దిగారు. దాడి చేశారు. ఈ దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశా. పోలీసులు వచ్చి 3 ట్రాక్టర్లు, జేసీబీ సీజ్ చేశారు." -ఆర్.ఐ.అరవింద్
సంబంధిత కథనం: Attack on RI: అక్రమ మట్టి తవ్వకాలు.. అడ్డుకున్న ఆర్ఐపై దాడి