ETV Bharat / state

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష తేదీలో మార్పు.. మళ్లీ ఎప్పుడంటే

APPSC GROUP 1: ఆంధ్రప్రదేశ్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ నిర్వహించబోయే గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష తేదీలో మార్పు జరిగింది. పాలనాపరమైన కారణాల వల్లే ఈ పరీక్ష తేదీలో మార్పు చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.

APPPSC
ఏపీపీఎస్సీ
author img

By

Published : Nov 11, 2022, 10:11 PM IST

APPPSC: ఏపీపీఎస్సీ గ్రూప్​-1 ప్రిలిమినరీ పరీక్ష తేదీ మారింది. ఈ పరీక్షను మొదట డిసెంబర్​ 18న నిర్వహించాలని ఏపీపీఎస్సీ భావించింది. కానీ, పాలనాపరమైన కారణాల వల్ల మరో తేదీకి మార్పు చేస్తున్నట్లు ఏపీ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ ప్రకటించింది. పరీక్ష నిర్వహించటానికి అధికారులు మరో కొత్త తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 8వ తెేదీన నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్​ అరుణ్​కుమార్​ వెల్లడించారు. పరీక్ష నిర్వహించే టైమింగ్​లో మార్పులేవి లేవని.. కేవలం తేదీలో మాత్రమే మార్పులు చోటు చేసుకున్నాయని ఆయన తెలిపారు. అయితే ఈ గ్రూప్​-1 పరీక్షకు ఏపీపీఎస్సీ గతంలోనే అన్​లైన్​లో దరఖాస్తులను స్వీకరించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.