- వైసీపీలో అంతర్యుద్ధం.. విధ్వంసాల సంవత్సరంగా 2022 : చంద్రబాబు
CHANDRABABU FIRES ON CM JAGAN : రాష్ట్రం గంజాయి హబ్‌గా మారి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. గంజాయి, డ్రగ్స్ నివారణపై సీఎం శ్రద్ధ పెట్టట్లేదని.. ఈ మూడున్నరేళ్లలో 53 వేల మందికి పైగా మహిళలపై అఘాయిత్యాలు జరిగాయని పేర్కొన్నారు. సంపద సృష్టించే యువశక్తి రాష్ట్రంలో నిర్వీర్యమైపోయిందని ఆక్షేపించారు. నిరుద్యోగుల్లో నిరుత్సాహం, నిస్సహాయత నెలకొన్నాయన్నారు. అధికార పార్టీలోనూ అంతర్యుద్దం మొదలైందని బాబు పేర్కొన్నారు.
- అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు
Inappropriate comments on Ayyappa Swamy: భారత్ నాస్తిక్ సమాజ్ తెలంగాణ అధ్యక్షుడు బైరి నరేష్ అయ్యప్పస్వామిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. వెంటనే అతనిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ... అయ్యప్ప భక్తులు రోడ్డెక్కారు. మన రాష్ట్రంలోనూ.... పలు జిల్లాల్లో భక్తులు ఆందోళనలు, ధర్నాలు నిర్వహించారు.
- పలువురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు.. ఇందులో ఎవరున్నారంటే?
IPS Officers Promotions: రాష్ట్రంలో పలు ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్, అమిత్‌గార్గ్, మహేష్‌దీక్షిత్‌లకు డీజీపీ స్థాయి హోదాను కల్పించింది. వీరితో పాటు మరికొంత మందికి కూడా పదోన్నతులు కల్పించింది.
- అయోమయంలో వైకుంఠ ద్వార దర్శనం.. టీటీడీ నిర్ణయాలతో భక్తుల అవస్థలు
TTD DECISION OVER VAIKUNTA EKADASI : తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి తితిదే అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు భక్తులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ముందస్తు ప్రకటనలు లేకుండా శని, ఆదివారాల్లో సమయనిర్దేశిత సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేతతో పాటు.. గత రెండు రోజులుగా ఆఫ్‌లైన్‌లో టోకెన్ల జారీ తీవ్ర అస్తవ్యస్తంగా మారింది.
- కొత్తగా కరోనా వ్యాప్తి.. దేశంలో తొలి 'సూపర్ వేరియంట్' కేసు.. డేంజరేనా?
అమెరికాను వణికిస్తున్న ఒమిక్రాన్ ఉపరకం ఎక్స్‌బీబీ.1.5 తొలి కేసు భారత్‌లోనూ నమోదైంది. బీక్యూ, ఎక్స్‌బీబీ సబ్ వేరియంట్లతో పోల్చితే రోగనిరోధకతను ఏమార్చే సామర్థ్యం దీనికి ఎక్కువ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వ్యాప్తి అవకాశాలూ ఎక్కువేనని అంటున్నారు.
- పాల డబ్బులు ఇవ్వలేదని దారుణం.. మహిళపై దాడి.. గర్భస్థ శిశువు మృతి
డబ్బులు ఇవ్వలేదని ఓ పాల వ్యాపారి దారుణానికి పాల్పడ్డాడు. సొమ్మును వసూలు చేసుకునేందుకు తన కొడుకులను వెంటబెట్టుకెళ్లిన వ్యాపారి.. కస్టమర్ కుటుంబ సభ్యులపై తీవ్ర దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో గాయపడ్డ మహిళకు గర్భస్రావం అయింది.
- విశ్రాంత పోప్ బెనెడిక్ట్ కన్నుమూత.. సంతాపం తెలిపిన మోదీ
విశ్రాంత పోప్ బెనెడిక్ట్ కన్నుమూశారు. శనివారం ఉదయం ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వాటికన్ ప్రతినిధులు ప్రకటించారు. బెనెడిక్ట్ మరణంపై ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు.
- హనుమాన్ ఆలయాన్ని వెనక్కి జరిపిన ఇంజినీర్లు.. మూలవిరాట్‌ను తాకకుండానే..
జాతీయ రహదారి పక్కనున్న దేవాలయాన్ని ఎనిమిది అడుగులు వెనక్కి జరిపారు ఇంజినీర్లు. రోడ్డు విస్తరణకు వీలుగా గుడిని జాగ్రత్తగా వెనక్కి జరిపారు అధికారులు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది.
- రిషభ్ పంత్ హెల్త్ అప్డేట్.. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే..
Rishabh Pant Accident : శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టీమ్ఇండియా ప్లేయర్ రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నపంత్ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐతో పాటు దిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిశితంగా పరిశీలిస్తోంది. అయితే శనివారం పంత్ ఆరోగ్యంపై మరో హెల్త్ అప్డేట్ వచ్చింది.
- 'జబర్దస్త్' ఒక్క మగాడు.. అన్‌స్టాపబుల్‌గా 500 ఎపిసోడ్స్.. 'రాకెట్' రాఘవ కితకితలు!
తెలుగు బుల్లితెెరపై 'జబర్దస్త్' కామెడీ షోకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గురువారం, శుక్రవారం అయితే చాలు.. ఈ షో వచ్చే టైంకి టీవీలకు అతుక్కుపోతారు ప్రేక్షకులు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది అభిమానులను సొంతం చేసుకుంది 'జబర్దస్త్'. ఈ షోతో ఎంతో మంది హాస్యనటులు పరిచయమయ్యారు. వెండితెర అవకాశాలు అందుకున్నారు.