ETV Bharat / state

కూలి కన్నా దారుణంగా..ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి: బండి శ్రీనివాసరావు

BANDI SRINIVASA RAO: ఉద్యోగులు నెలంతా పనిచేస్తే 30న జీతం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని.. ఏపీ ఎన్జీవో సంఘం నేత బండి శ్రీనివాసరావు అన్నారు. ఏ ప్రభుత్వంతోనూ ఉద్యోగ సంఘాలకు లాలూచీ లేదని.. ఉద్యోగుల ఉద్యమాన్ని ఎప్పుడూ నేతలు తాకట్టు పెట్టలేదన్నారు.

BANDI SRINIVASA RAO
BANDI SRINIVASA RAO
author img

By

Published : Dec 16, 2022, 3:44 PM IST

AP NGO LEADER BANDI : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కూలి కన్నా దారుణంగా ఉందని ఏపీ ఎన్జీవో సంఘం నేత బండి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలు, కూరగాయలు, బ్యాంకుల వాళ్ల దగ్గర కూడా ఉద్యోగులు లోకువయ్యే పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడం లేదన్నారు. ఏ ప్రభుత్వంతోనూ ఉద్యోగ సంఘాలకు లాలూచీ లేదని.. ఉద్యోగుల ఉద్యమాన్ని ఎప్పుడూ నేతలు తాకట్టు పెట్టలేదన్నారు. ఉద్యోగులు నెలంతా పనిచేస్తే 30న జీతం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అన్నారు.

ఒక్క నెల జీతం రాకపోతేనే ఇబ్బందులు పడతాం.. అలాంటిది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు బకాయిలు పెడితే ఎలా? అని ప్రశ్నించారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించాకే ఐఏఎస్‌లకు ఇస్తామని నోటిమాటగా చెప్పడమే కానీ అది అమల్లో లేదని మండిపడ్డారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ 62 ఏళ్ల ఉద్యోగ విరమణ వయసు వర్తింపజేయాలని డిమాండ్​ చేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకూ బదిలీ ప్రక్రియ చేపట్టాలని.. జీపీఎఫ్‌ నిధులను ఉద్యోగులకు ఇవ్వకుండా ప్రభుత్వం వాడుకోడమేంటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక పింఛన్లను ఒకటో తేదీనే ఇస్తున్న ప్రభుత్వం.. పెన్షనర్లకు కూడా అదే ప్రాధాన్యత ఇవ్వాలని అని శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.