Anganwadi Workers Strike In AP : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు విమర్శించారు. ప్రస్తుతం ఇస్తున్న వేతనాలు అంగన్వాడీల కుటుంబ పోషణకు సరిపోవడం లేదని తెలిపారు. సీఎం జగన్ ప్రతీ సభలో నా అక్కా చెల్లెమ్మలు అని మాట్లాడుతారని అలాంటిది అంగన్వాడీలు అక్క చెల్లెమ్మలు కాదా? అని ప్రశ్నించారు. అంగన్వాడీలను రాష్ట్ర ప్రభుత్వం రోడ్డున పడేసిందని మండిపడ్డారు.
CPM State Secretary Support of Anganwadis : సచివాలయ ఉద్యోగులు, అంగన్వాడీలకు తగాదా పెట్టే విధంగా జగన్ నిర్వాకం ఇందని దుయ్యాబట్టారు. అంగన్వాడీల సమ్మెకు సీపీఎం అండగా ఉంటుందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల తలుపులు బద్ధలు గొట్టడం చట్ట వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. సలహాదారుల పేరుతో కావాల్సిన వాళ్లకు లక్షల రూపాయల వేతనాలు చెల్లించడానికి డబ్బులున్న ముఖ్యమంత్రి జగన్కు అంగన్వాడీలకు వేతనాలు పెంచడానికి లేవా? అని ప్రశ్నించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తల నిరవధిక సమ్మె - మూతపడిన కేంద్రాలు
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్లో గళమెత్తాలన్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకించాలని ప్రతీ ఎంపీకీ లేఖలు రాశామని తెలిపారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని శ్రీనివాసరావు దుయ్యబట్టారు.
Nakka Ananda Babu Support to Anganwadis : తమ సమస్యలు పరిష్కరించాలని గత ఎనిమిది రోజులుగా నిరసన తెలుపుతున్న అంగన్వాడీల పట్ల ప్రభుత్వం తీరు దున్నపోతుపై వర్షం పడ్డ చందంగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి నక్క ఆనందబాబు విమర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతున్న అంగన్వాడీలకు ఆయన సంఘీభావం తెలిపారు. చిన్న పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే అంగన్వాడీ వర్కర్స్ జీతాలు పెంచాలని సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రతి నాలుగైదు ఏళ్లకు పెరిగే ధరల సూచికకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల ఆందోళన
తెలుగుదేశం పార్టీ హయాంలో రెండు సార్లు అంగన్వాడీలకు జీతాలు పెంచడం జరిగిందని వివరించారు. జగన్ మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడేమో వారి సమస్యలు పరిష్కరించమంటే పట్టించుకోవటం లేదన్నారు. అందుకే అంగన్వాడీలు నిరసన కార్యక్రమాలు చేయాల్సి వస్తుందని విమర్శించారు. నమ్మి ఓట్లేసిన ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం మొండి చేయి చూపిందన్నరు. మరో మూడు నెలల్లో ఎన్నికల రానున్నాయని జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. అప్పుడు అంగన్వాడీలకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంగన్వాడీల సమస్యలను చంద్రబాబుతో చర్చించి న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు.
అంగన్‌వాడీ వర్కర్ల పోరాటాలపై వైసీపీ సర్కార్ ఉక్కుపాదం.. ఇచ్చిన హామీలను మరిచి, వేధింపులు!