ETV Bharat / state

కదం తొక్కిన అంగన్వాడీలు - మంత్రుల ఇళ్ల ముట్టడి - Anganwadi Strike ap

Anganwadi Strike in Andhra Pradesh : అంగన్​వాడీలు, ఆయాలు తమకు కనీస వేతానాలు పెంచి గ్రాట్యూటీ అమలు చేయాలని చేస్తున్న ఉద్యమం శనివారానికి 19వ రోజుకు చేరుకుంది. అంగన్​వాడీల సమస్యలపై ప్రభుత్వం మొండివైఖరితో ఉన్నా వారు ఏమాత్రం తగ్గకుండా పోరాటాన్ని ముందుకు తీసుకుపోతున్నారు.

anganwadi
anganwadi
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 30, 2023, 5:40 PM IST

Anganwadi Strike in Andhra Pradesh : జగన్‌ మొండైతే తాము జగమొండి అంటూ 19వ రోజు అంగన్వాడీలు ఉద్యమాన్ని మరింత ఉద్ధృతంగా నిర్వహించారు. రాష్ట్రంలో అనేక చోట్ల మంత్రుల ఇంటి ముట్టడికి అంగన్వాడీ కార్యకర్తలు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించి నినాదాలు చేశారు. ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె ఆగదని స్పష్టం చేశారు.

Anganwadi Strike in Anantapur District : అనంతపురంలో అంగన్వాడీల అరెస్టు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కళ్యాణదుర్గంలో మంత్రి ఉష శ్రీచరణ్ ఇంటిని ముట్టడించడానికి అంగన్వాడీ కార్యకర్తలు బయలుదేరారు. అనంతపురం శివారులోని బైపాస్ సరిగమ్మ దేవాలయం వద్ద పోలీసులు అంగన్వాడీల వాహనాన్ని అడ్డుకున్నారు. ఆటో, జీప్ వాహనాల్లో ఉన్న అంగన్వాడీలను కిందకు దింపేశారు. దీంతో ఆగ్రహించిన అంగన్వాడీలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల ఆందోళన

Anganwadi Strike in Tirupati District : తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ముట్టడికి అంగన్వాడీ కార్యకర్తలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అంబేడ్కర్‌ భవన్‌ నుంచి ర్యాలీగా బయల్దేరిన అంగన్వాడీలను వెస్ట్‌ చర్చి కూడలిలో పోలీసులు అడ్డుకున్నారు. వాహనాల రాకపోకలను పోలీసులు దారి మళ్లించారు. రోడ్డుపైనే బైఠాయించిన అంగన్వాడీలు సమస్యలు పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Anganwadi Strike in Vizianagaram : విజయనగరంలోనూ మంత్రి బొత్స ఇంటి ముట్టడికి అంగన్వాడీలు యత్నించారు. కోట కూడలి నుంచి ర్యాలీగా బయలు దేరిన అంగన్వాడీలను మంత్రి ఇంటి సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. బొత్స ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులు అనుమతించకపోవడంతో రహదారిపై బైఠాయించిన అంగన్వాడీలు ధర్నా చేశారు.

అంగన్​వాడీ హామీలను గాలికి వదిలేసిన జగన్​ ప్రభుత్వం - కొనసాగుతున్న ఆందోళన

Anganwadi Strike in Guntur District : అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో మంత్రి విడదల రజిని ఇంటిని ముట్టడించారు. అంగన్వాడీ కార్యకర్తలు విడదల రజిని ఇంటి ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలను పట్టించుకోకపోవడం దుర్మార్గమని ప్రభుత్వం స్పందించే వరకు తాము పోరు కొనసాగిస్తామన్నారు. మంత్రి రజిని అంగన్వాడీల వద్దకు వచ్చి వినతిపత్రాన్ని స్వీకరించారు.

Anganwadi Strike in Srikakulam District : శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు. ప్రధాన ద్వారం వద్ద పోలీసులు అడ్డుకున్నా గేట్లను తోసుకుంటూ ముందుకు దూసుకెళ్లారు. అంగన్వాడీల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి అప్పలరాజు హామీ ఇచ్చినా అంగన్వాడీ సిబ్బంది అసంతృప్తితోనే వెనుదిరిగారు.

మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించిన అంగన్వాడీలు - పలుచోట్ల ఉద్రిక్తత

Anganwadi Strike in Krishna District : కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు ఐసీడీఎస్​ ప్రాజెక్టు కార్యాలయం రిలే దీక్ష చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా చావే దిక్కు అంటూ ఉరితాళ్లతో నిరసన చేపట్టారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైసీపీ సాధికార బస్సు యాత్రలో మంత్రులు, ఎమ్మెల్యేలకు అంగన్వాడీలు సమస్యలు విన్నవించుకుందామంటే పోలీసులు అడ్డుకున్నారు. సుబ్బారాయుడుపాలెం వద్ద అంగన్వాడీల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో సమీపంలోని దేవుడు మామిడి తోటలో బైఠాయించి ఆందోళన చేశారు.

Anganwadi Strike in Prakasam : ప్రకాశం జిల్లా మార్కాపురంలో మంత్రి సురేష్ ఇంటిని అంగన్వాడీలు ముట్టడితో ఉద్రికత్త ఏర్పడింది. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు ఆందోళన చేశారు. మంత్రి సురేష్‌ ఇంటి ఎదుట బైఠాయించి అంగన్వాడీలు నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో అంగన్వాడీలకు, వారికి మధ్య తోపులాట జరిగింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.