Alluri Sitarama Raju birth anniversary celebrations: అల్లూరి జయంతిని రాష్ట్రపతి గుర్తించినా రాష్ట్రప్రభుత్వం గుర్తించకపోవటం దురదృష్టకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజా హితం కోసమే రాజకీయాలు తప్ప స్వార్ధం కోసం చేసేవి రాజకీయాలు కావని హితవు పలికారు. అల్లూరి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించాలని 2014లో తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించి ఉత్తర్వులు కూడా ఇచ్చిందని చంద్రబాబు గుర్తుచేశారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే అమరావతి లో అల్లూరి సీతారామరాజు మెమోరియల్ ఏర్పాటు చేయటంతో పాటుగా... భోగాపురం విమానాశ్రయానికి ఆయన పేరు పెడతామని స్పష్టంచేశారు. దిల్లీ పార్లమెంట్ లో అల్లూరి చిత్రపటం లేదా విగ్రహం ఉండాలన్నారు. ప్రపంచానికి సేవ చేసే శక్తి భారతదేశానికి వస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. చరిత్రలో అల్లూరి సీతారామరాజు శాశ్వతంగా నిలిచే పోరాట యోధుడని కొనియడారు.
బ్రిటీష్ పాలన కంటే దారుణంగా వైసీపీ ప్రభుత్వం ఉందనటానికి ఎంపీ రఘురామకృష్ణ రాజుకి జరిగిన కస్టోడీయల్ టార్చర్ ఓ ఉదాహరణ అని బీజేపీ సీనియర్ నేత విష్ణు కుమార్ రాజు విమర్శించారు. అల్లూరి సీతారామరాజు స్పూర్తితో ప్రతీ ఒక్కరూ వచ్చే సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ లో పాల్గొనాలని కోరారు. చట్టసభల కు ఈ ప్రభుత్వంలో ఏమాత్రం గౌరవం లేకుండా చేసిందని మండిపడ్డారు. నాలుఏళ్ల తర్వాత మళ్లీ చంద్రబాబు పక్కన కూర్చోవడం తనకు ఓ అరుదైన అనుభూతి అన్నారు. చంద్రబాబుతో పాటు మళ్లీ అసెంబ్లీలో కూర్చునే అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై బీజేపీ తరఫున పోరాడాల్సిన బాధ్యత తమపైనా ఉందని చెప్పారు.
- Alluri Sitarama Raju Jayanthi Celebrations: రాష్ట్రవ్యాప్తంగా అల్లూరి జయంతి.. పలువురి నివాళి..
ఎవరి ఆశయాల కోసం 100ఏళ్ల కిందట అల్లూరి పోరాడాడో ఆయన ఆశయాలు ఇంకా నెరవేరలేదనటానికి పోలవరం నిర్వాసితులే ఉదాహరణ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అల్లూరి పుట్టిన తెలుగుగడ్డపై భయపడే రాజకీయాలకు స్వస్తిపలికి అందరి అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పుకోవాలని ఆకాంక్షించారు. తెలుగు ప్రజల పోరాటానికి ప్రతిబింబం అల్లూరి సీతారామరాజు, ఆ పోరాట స్పూర్తితో ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు వ్యక్తి కాదు ఓ శక్తి అని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు తెలిపారు. అల్లూరి సమాధిని ప్రతి ఒక్కరూ దర్శించుకుని పోరాట స్ఫూర్తి పొందాలన్నారు. రాజకీయాలకు అతీతంగా ఓ స్వాతంత్ర్య సమరయోధుడి కోసం అంతా కలిసి రావటం శుభపరిణామమని పేర్కొన్నారు. విప్లవ వీరుడు అల్లూరి స్ఫూర్తి కి మారుపేరుగా నిలిచే మన్యం ప్రాంతాల్ని సీఎం జగన్ గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా మార్చారని జనసేన ప్రధాన కార్యదర్శి పోతిన మహేష్ ఆరోపించారు. బ్రిటీష్ డీఎన్ఏ ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి తీసేయాలని పోతిన మహేష్ పిలుపునిచ్చారు. అల్లూరి స్పూర్తితో గిరిజన ప్రాంతాల అభివృద్ధి కి జనసేన కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అతీతంగా ఈ ఉత్సవాల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ , వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు , బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు, ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షులు బీ శెట్టి బాబ్జీ తదితరుల పాల్గొన్నారు. - Draupadi Murmu Hyderabad Tour : హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి.. గవర్నర్, సీఎం ఘన స్వాగతం