ETV Bharat / state

'ఏసీబీ దాడుల్లో అడ్డంగా దొరికిన గరికపాడు చెక్​పోస్ట్​ ఎంవీఐ' - 'సర్టిఫికేషన్​కు 10వేలు డిమాండ్ చేసిన రెవెన్యూ సిబ్బంది'

ACB Rides in Garikapadu : రాష్ట్రంలో లంచావతారుల హవా సాగుతోంది. కొన్ని చోట్ల ఏసీబీ నిఘా పెట్టింది. మరికొన్ని చోట్ల బాధితుల ఫిర్యాదు మేరకు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అంచం తీసుకుంటూ అధికారులు ఏసీబీ వలలో చిక్కుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని తాళ్లపూడి మండలంలో రెవెన్యూ అధికారులు, గరికపాడు చెక్​పోస్ట్​లో ఎంవీఐలు ఏసీబీకి పట్టుబడ్డారు.

ACB Rides in Garikapadu Checkpost
ACB SUDDEN RIDES IN AP 2023
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 2, 2023, 1:29 PM IST

ACB Rides in Garikapadu Checkpost : ఎన్​టీఆర్​ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద గల జాతీయ రహదారి సరిహద్దు ఆర్‌టీఏ చెక్ పోస్ట్​లో ఉదయం ఏసీబీ దాడులు జరిగాయి. ఈ క్రమంలో రూ. 76 వేల అదనపు నగదుతో ఎంవీఐ శేఖర్... ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ ఎడిషనల్ ఎస్పీ మహేంద్ర నిర్వహించిన దాడుల్లో శేఖర్ తన వ్యక్తిగత డ్రైవర్ సహా నలుగురు ప్రైవేట్ వ్యక్తులతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించామని మహేంద్ర తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలోనూ ఏసీబీ దాడుల్లో మండల రెవెన్యూ అధికారులు రూ.7వేలు తీసుకుంటూ రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డారు.

'ఏసీబీ దాడుల్లో అడ్డంగా దొరికిపోయిన గరికపాడు చెక్​పోస్ట్​ ఎంవీఐ ఎంవీఐ' - 10వేలు డిమాండ్ చేసిన రెవెన్యూ సిబ్బంది

'గరికపాడు చెక్​పోస్ట్​ దగ్గర ఆకస్మిక తనిఖీ నిర్వహించాం. ఇక్కడ ఎంవీఐ. శేఖర్​, వ్యక్తగత డ్రైవర్​, మరో నలుగురితో కలిసి డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. సోదాలో రూ.76 వేలు దొరికాయి.'- ఎన్​టీఆర్​ జిల్లా ఏసీబీ ఎడిషనల్ ఎస్పీ, మహేంద్ర

ACB RIDES IN EaST GODAVARI : తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం, తాళ్లపూడిలో తూ.గో జిల్లా అడిషనల్ ఎస్పీ సౌజన్య ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మండల డిప్యూటీ తహసీల్దార్ అహ్మద్, మలకపల్లి వీఆర్ఓ శ్రీనివాసరావు రూ.ఏడువేలు లంచం తీసుకుంటూ, ఏసీబీకి చిక్కారు. మలకపల్లి గ్రామానికి చెందిన వీర్రాజుకు 10 సెంట్లు భూమి, రికార్డుల్లో 22 (ఏ) లో ఉంది. తమ సొంత భూమి అని ఆధారాలతో అధికారులకు తెలిపినప్పటికీ వారు దాన్ని తిరస్కరించారు. రెవెన్యూ అధికారులు అది వారి భూమి అని సర్టిఫికెట్ ఇవ్వడానికి పది సెంట్లు భూమికి రూ. పదివేలు డిమాండ్ చేశారు. దీంతో వీర్రాజు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

'మలకపల్లికి చెందిన వీర్రాజు వారి నాన్నగారి పేరున ఉన్న 10 సెంట్ల భూమి ప్రత్రాలను బ్యాంక్​లో పెట్టి ఖాతా అప్లై చేసుకోవడానికి వెళ్లాడు. బ్యాంక్​లో.. అది ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉందని, అది మీ సొంత భూమి అని సర్టిఫికేట్​ కావాలని కోరారు. దీంతో వీఆర్​ఓని కలుస్తారు. అక్కడ నుంచి ఎంఆర్​ఓ దగ్గరకు వెళ్లి విషయం చెప్పారు. అది ప్రభుత్వ భూమిగా ఆధారపత్రం జారీ చేయడానికి సమయం పడుతుంది. కానీ ప్రభుత్వ భూమి కాదని సర్టిఫికేట్​ ఇప్పిస్తామని డిప్యూటి తహసీల్దార్ అహ్మద్​ చెప్తారు. వారు అది ప్రభుత్వ భూమి కాదని ఆధార పత్రం ఇవ్వడానికి రూ. పదివేలు ఇవ్వవలసి ఉంటుందని డిమాండు చేశారు. అంత డబ్బు ముట్టజెప్పలేమని వీర్రాజు చెప్పగా రూ. ఏడు వేలు ఖరారు చేశారు. దీంతో బాధితుడు 14400 నంబర్​కి ఫోన్​ చేసి ఫిర్యాదు చేశాడు. మేము లంచం తీసుకున్న అధికారులను మాటు వేసి పట్టుకున్నాం. ఇలా ఎవరైనా డబ్బులు డిమాండ్​ చేస్తే మమ్మల్ని సంప్రదించండి. నేరుగా ఆఫీసుకు వచ్చి అయినా ఫిర్యాదు చెయ్యొచ్చు.' - తూ.గో జిల్లా అడిషనల్ ఎస్పీ, సౌజన్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.