ETV Bharat / state

భూమా అఖిల ప్రియ Vs శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి.. నంద్యాలలో వేడెక్కిన రాజకీయం - tdp leader bhuma akhila priya

Nandyala political war : ఎన్నికలకు ముందే నంద్యాలలో రాజకీయం వేడెక్కింది. టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రెస్​మీట్లు పెట్టి మరీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

Nandyala political war
Nandyala political war
author img

By

Published : Feb 6, 2023, 8:32 AM IST

భూమా అఖిల ప్రియ Vs శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి.. నంద్యాలలో వేడెక్కిన రాజకీయం

POLITICAL WAR IN NANDYALA : రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఎన్నికలకు సంవత్సరం పైగా సమయం ఉండగానే రాజకీయ నేతలు వారి మాటలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో మాటల యుద్ధానికి దిగుతున్నారు. తాజాగా నంద్యాలలో టెన్షన్​ వాతావరణం నడుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి, టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మినీ వార్​ నడుస్తోంది.

నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలుగు దేశం పార్టీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబంపై చేసిన విమర్శలకు ఆధారాలు చూపాలని ఆమె డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డలో అవగాహన లేని ఓ వ్యక్తి చెబితే మీడియా సమావేశాలు పెట్టి విమర్శిస్తున్నారన్నారని మండిపడ్డారు. శిల్పా కుటుంబం చేసిన ఆక్రమాలు సాక్షాధారలతో..సహా ఉన్నాయని.. శిల్పా కుటుంబం నుంచి నష్టపోయిన రైతులతో ధర్నా కార్యక్రమం చేపడతామన్నారు.

"నంద్యాల ఎమ్మెల్యే, మా మధ్యన జరిగే డిస్కషన్స్​, హౌస్​ అరెస్టులు అన్ని మీడియా ద్వారా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వాస్తవాలు నిరూపించండి. మేము లీజ్​కి తీసుకున్నామని చెప్పి మాట్లాడారు. మేము బలవంతంగా 200 ఎకరాలు తీసుకున్నామని ఆధారాలు ఉన్నాయా.. లేవు. కానీ అదే భూములు తీసుకుని మీరు రియల్​ ఎస్టేట్​ చేశారు. మీ నుంచి నష్టపోయిన రైతులతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడుతాం"-భూమా అఖిల ప్రియ, మాజీ మంత్రి

ఎమ్యెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి.. భూమా అఖిల మాటలకు వివరణ ఇస్తూ..ఇంతటితో ఈ వివాదానికి ముగింపు పలకాలని సూచించారు.

"ఈ టీవీ సీరియల్​కి ముగింపు పలకాలని డిసైడ్​ అయ్యా. నువ్వు, నేను కొట్టుకున్నంత మాత్రానా ప్రజలకు ఒరిగేది ఏదీ లేదు. దీని వల్ల దమ్మిడి ఆదాయం లేదు. నంద్యాల ప్రజలకు ఉపయోగపడేది లేదు. నేను ప్రజలకు ఉపయోగపడే పనుల్లో మాత్రమే బిజీగా ఉంటా"-శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి, ఎమ్మెల్యే

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.