Sanitary Inspector Suicide Attempt: నంద్యాల జిల్లా నందికొట్కూరు పురపాలక శానిటరీ ఇన్‌స్పెక్టర్ సునీత ఆత్మహత్యాయత్నం చేసింది. సోమవారం శానిటరీ కింది స్థాయి సిబ్బంది తమను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని కమిషనర్ కిషోర్‌కు పిర్యాదు చేశారని, ఈ విషయమై కమిషనర్‌ను కలిసేందుకు వెళ్లిన శానిటరీ ఇన్స్పెక్టర్ను ఫిర్యాదు విషయమై అడిగినట్లు తెలిసింది. తమపై కార్యాలయంలో కక్షసాధింపులు చేస్తున్నారని మనస్తాపం చెందిన శానిటరీ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలోని దోమల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.
ఈ విషయం గమనించిన సిబ్బంది చికిత్స కోసం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కమిషనర్ కిశోర్ వేధింపుల కారణంగానే తన భార్య ఆత్మహత్యాయత్నం చేసిందని సునీత భర్త గిడియన్ తెలిపారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని ఆయన కోరారు.
నందికొట్కూరు మున్సిపాలిటీలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సునీత భర్తను నేను. గత ఆరు నెలల నుంచి కమిషనర్ వేధింపులు తీవ్రంగా ఉన్నాయి. తన ఉద్యోగ రీత్యా ఎంత కష్టపడుతున్నా.. ఏదో ఒక వంక పెడుతూ ఆటంకం కలిగిస్తున్నారు. ఎటువంటి ఆదారాలు లేని ఆరోపణలు చేస్తూ.. ఆమెకు వ్యతిరేకంగా కొందరిని సృష్టించుకొని.. వారి ద్వారా ఫేక్ రిపోర్టులు ఇప్పిస్తూ.. మీడియాకు అసత్య ఆరోపణలు ప్రచారం చేస్తున్నారు. దీనికి కారణం.. ఆమెను లైంగికంగా టార్గెట్ చేశారేమో అని నా ఉద్దేశం. ఆ కమిషనర్ వేధింపులను చూస్తుంటే.. తనని లైంగికంగా టార్గెట్ చేశారని స్పష్టం అవుతోంది. మహిళ అన్నీ చెప్పుకోలేదు. - గిడియన్, బాధితురాలి భర్త
ఇంతవరకూ తను నాకు ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే ఉద్యోగరీత్యా అందరికీ ఏవో ఒక కష్టాలు ఉంటాయి. ఇవి పరిష్కారం అవుతాయి అనుకున్నాం.. కానీ ఇంత తీవ్ర పరిస్థితికి వస్తాయని నేను కూడా ఎప్పుడూ అనుకోలేదు. తను నాకు చెప్పుకోలోక పోయింది. ఏవరికి చెప్పాలో తెలియలేదు. ఈ మధ్యనే ఒక ఫేక్ ఫిర్యాదు రాసి.. తనని వివరణ అడిగారు. తను వెళ్లి ఆ ఫిర్యాదు ఇచ్చిన వర్కర్స్‌ని అడగగా.. అవి మా సంతకాలు కావు అని చెప్పారు. మేం ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని వాళ్లు తెలిపారు. దీనినిబట్టి అర్థమవుతోంది.. ఏదో ఒక వంక చూపించి వేధిస్తున్నారని.. కేవలం తనని లైంగికంగా లొంగ దీసుకోవడానికే అని అర్థం అవుతోంది. మానసికంగా కృంగదీశారు. ఈ రోజు తన ఆత్మహత్యాయత్నం చేసుకుందంటే.. దానికి కమిషనర్ కారణం. అతనిపై చర్యలు తీసుకోవాలి. ఒక మహిళా ఉద్యోగికి న్యాయం చేయండి. - గిడియన్, బాధితురాలి భర్త
ఇవీ చదవండి: