ETV Bharat / state

Nara Lokesh నాది అంబేద్కరిజం.. జగన్​ది సైకోయిజం: నారా లోకేశ్ - నంద్యాల జిల్లా వార్తలు

Serious allegations against cm: 2024 ఎన్నికల్లో కోటీశ్వరుడు జగన్​కి కూటికి లేని పేదలకు మధ్య యుద్ధం జరగనుందని, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన నారా లోకేశ్.. జగన్ ది రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు. తనది అంబేద్కరిజం అంటూ వెల్లడించిన లోకేశ్... జగన్ ది సైకోయిజం అంటూ ఎద్దేవా చేశాడు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : May 13, 2023, 9:03 PM IST

Updated : May 14, 2023, 6:18 AM IST

Nara Lokesh serious allegations against cm jagan: 2024 ఎన్నికల్లో కోటీశ్వరుడు జగన్​కి కూటికి లేని పేదలకు మధ్య యుద్ధం జరగనుందని లోకేశ్ తెలిపాడు. ఊసరవెల్లి జగన్ నిక్కర్ వేసుకునే టైం లోనే దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్ అని లోకేశ్ గుర్తు చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన నారా లోకేశ్ జగన్ ది రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు. తడిచిన ధాన్యం కొనమని ఒక రైతు అడిగితే ఎర్రిపప్ప అని తిట్టాడు మంత్రి కారుమూరి నాగేశ్వరావు అని, ఎర్రిపప్ప సీఎం జగన్ గారు ధాన్యం ఎప్పటిలోగా కొంటారు అని ప్రశ్నించారు. మంత్రి, జగన్ రాష్ట్ర రైతులకు క్షమాపణ చెప్పే వరకూ మీ ప్రభుత్వాన్ని ఎర్రిపప్ప ప్రభుత్వం అని, ఎర్రిపప్ప జగన్ అని పిలుస్తామని లోకేశ్ స్పష్టం చేశారు.

నాది అంబేద్కరిజం... జగన్ ది సైకోయిజం. మీరు అంబేద్కర్ గారి వైపు ఉంటారా? సైకో వైపు ఉంటారా తేల్చుకోండి. రాబోయేది టీడీపీ ప్రభుత్వం. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వైసీపీ నాయకులు వడ్డీతో సహా చెల్లిస్తాం. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా రాష్ట్రానికి తెచ్చి శిక్షిస్తాం అంటూ హెచ్చరించారు. వృథాగా పోతున్న కృష్ణా జలాలను రాయలసీమకు తరలించాలని మొదట ఆలోచించింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారేనని తెలిపాడు. తెలుగుగంగ ప్రాజెక్టు, వెలుగోడు జలాశయం నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారని లోకేశ్ వెల్లడించారు. జగన్ ఒక పిరికోడు అందుకే మీ లోకేశ్​ని అడ్డుకోవడానికే జీవో1 తెచ్చారని... ఏ1 నువ్వు తెచ్చిన జీవో1 మడిచి పెట్టుకో అని నేను ఆరోజే గుర్తు చేసినట్లు లోకేశ్ తెలిపారు. ఇప్పుడు ఆ జీవోని హైకోర్టు కొట్టేసిందని.. 2024 ఎన్నికల్లో ఏ1 జెండా పీకేయడం పక్కానని లోకేశ్ జోష్యం చెప్పారు.

శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ఆయన తమ్ముడు, బంధువులు, అనుచరులు కలిసి శ్రీశైలంను దోచుకుంటున్నారని... భూకబ్జాలు, ఇసుక, ఎర్రమట్టి అక్రమంగా తరలిస్తున్నారని, అందుకే చీటింగ్ చక్రపాణి అని పేరు మార్చానని లోకేశ్ ధ్వజమెత్తారు. 5 లక్షలు పనికి కూడా 10 శాతం తీసుకుంటున్నాడు అంటే చీటింగ్ చక్రపాణికి ఎంత డబ్బు పిచ్చి ఉందో అర్ధం చేసుకోవాలని ఆరోపించారు. వర్ధన్ బ్యాంక్​ను ఎమ్మెల్యే ప్రారంభించారని, ఆ బ్యాంక్ రూ.100 కోట్లు సేకరించి దుకాణం సర్దేసిందని, బ్యాంకు పెట్టిన బినామీని పార్టీ నుండి సస్పెండ్ చేయించి డబ్బు మొత్తం కొట్టేసారని లోకేశ్ గుర్తు చేశారు.

జగన్ 50 శాతం సబ్సిడీతో రుణాలు ఇస్తాం అని దళితుల్ని మోసం చేశారని లోకేశ్ ఆరోపించారు. ఈ చీటింగ్ చక్రపాణి డిపాజిటర్లకు నేను హామీ తాను హామీ ఇస్తున్నానని.. వైసీపీ నాయకులు దోచుకున్న డబ్బులు కక్కిస్తామని లోకేశ్ వెల్లడించారు. శ్రీశైలం దేవస్థానాన్ని ఏటీఎంలా మార్చుకున్నారని లోకేశ్ విమర్శించాడు. శ్రీశైలం దేవస్థానంలో తన ఏజెన్సీ ద్వారా కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాల్లో భారీ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. హౌస్ కీపింగ్, సెక్యూరిటీ గార్డుల నియమాక టెండర్లు బంధువు రాజశేఖరరెడ్డి కట్టబెట్టారని తెలిపాడు. వ్యాపారుల దగ్గర నుండి అక్రమ వసూళ్లు, అక్రమంగా షాపుల ఏర్పాటు, లడ్డు తయారీలో అక్రమాలకు పాల్పడి దేవుడి సొమ్ము కాజేస్తున్నారని లోకేశ్ ధ్వజమెత్తారు.

బహిరంగ సభలో మాట్లాడిన నారా లోకేశ్‌

ఇవీ చదవండి:

Last Updated : May 14, 2023, 6:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.