Yuvagalam Padayatra: మహా పాదయాత్ర నిర్వహణ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఏ రోజుకారోజు ప్రాంతం మారిపోతుంది. తర్వాత రోజు ఉండేందుకు అనువైన ప్రదేశం చూసుకోవాలి.. అక్కడ ఉండేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయం చేసుకోవాలి. వేలాదిగా పాల్గొనే అభిమానులకు మంచినీళ్లు, భోజనం ఇతర ఏర్పాట్లు పర్యవేక్షించుకోవాలి. పాదయాత్ర చేసే నాయకుడి భద్రత నుంచి వెనుక వరుసలో నిడిచే చివరి కార్యకర్త వరకూ ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా లక్ష్యం చేరే వరకూ పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలి. గత 77రోజులుగా పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్ యువగళాన్ని విజయవంతంగా ముందుకు నడిపించటంలో ఆ 14 విభాగాల సమన్వయమే ప్రధాన కారణం.
నారా లోకేశ్ యువగళం మహా పాదయాత్ర వెయ్యిరోజులు పూర్తిచేసుకోవటంలో తెరవెనుక 14 కమిటీల కృషి కీలకమనే చెప్పాలి. అధికార పార్టీ నుంచి ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. పోలీసులు లాఠీలు ఘుళిపించినా.. ఎళ్లవేలలా ఈ కమిటీలే వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చాయి. పాదయాత్ర 1000 కి.మీ మైలురాయి చేరుకున్న సందర్భంగా ఇప్పటివరకు తనకు వెన్నంటి నిలచిన యువగళం సైనికులను లోకేశ్ ప్రత్యేకంగా అభినందించారు. తన యాత్ర సజావుగా సాగేలా అహర్నిశలు పనిచేస్తున్నారని వారిని కొనియాడారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. యువగళం ప్రధాన సమన్వయకర్త కిలారు రాజేష్ వ్యవహరిస్తుండగా.. ఈ కమిటీలు అనుక్షణం వెన్నంటి ఉండి సహకారం అందిస్తున్నాయి. వీరితోపాటు 100 మంది పసుపు సైనికులు వాలంటీర్లుగా వ్యవహరిస్తూ రేయింబవళ్లు పనిచేస్తున్నారు.
యువగళం అధికార ప్రతినిధులుగా ఎంఎస్ రాజు, దీపక్ రెడ్డిలు సమన్వయం చేస్తున్నారు. మీడియా కమిటీని చైతన్య, బివి వెంకట రాముడు, జస్వంత్‌లు చూసుకుంటుండగా.. భోజన వసతుల ఏర్పాటును మద్దిపట్ల సూర్యప్రకాష్, లక్ష్మీపతిలు పర్యవేక్షిస్తుండగా.. వాలంటీర్ కోఆర్డినేషన్ కమిటీ రవి నాయుడు, ప్రణవ్ గోపాల్‌ల నేతృత్వంలో పనిచేస్తోంది. రవి యాదవ్ రూట్ కో ఆర్డినేషన్ చేస్తుండగా డూండీ రాకేష్, నిమ్మగడ్డ చైతన్య, శ్రీరంగం నవీన్ కుమార్, ప్రత్తిపాటి శ్రీనివాస్‌లు అడ్వాన్స్ టీమ్ కమిటీగా పనిచేస్తున్నారు. వసతి ఏర్పాట్లను జంగాల వెంకటేష్, నారా ప్రశాంత్, లీలా కృష్ణ, శ్రీధర్, ఐనంపూడి రమేష్‌లు పర్యవేక్షిస్తున్నారు.
యువగళం పిఆర్ టీమ్‌గా కృష్ణా రావు, మునీంద్ర, కిషోర్‌లు పనిచేస్తుండగా, యువగళం సోషల్ మీడియా కోఆర్డినేషన్‌ను కౌశిక్, అర్జున్‌లు చూసుకుంటున్నారు. అలంకరణ కమిటీకి మలిశెట్టి వెంకటేశ్వర్లు, బ్రహ్మం పనిచేస్తుండగా రూట్ వెరిఫికేషన్ కమిటీని అమర్నాథ్ రెడ్డి, కస్తూరి కోటేశ్వరరావులు పర్యవేక్షిస్తున్నారు. భాస్కర్, వెంకట్లు తాగునీటి సదుపాయం ఏర్పాటు చేస్తుండగా, సెల్ఫీ కోఆర్డినేషన్ సూర్య ఆధ్వర్యంలో పనిచేస్తోంది.