ETV Bharat / state

పారుమంచాలలో ముగిసిన తితిదే ఈవో కుమారుడి అంత్యక్రియలు - AP Highlights

Funeral of TTD EO son has ended: గత ఆదివారం గుండెపోటుకు గురై చికిత్స పొందుతూ కన్నుమూసిన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళిరెడ్డి అంత్యక్రియలు స్వగ్రామంలో ముగిశాయి. సీఎం జగన్​.. ధర్మారెడ్డి కుటుంబ సభ్యలును పరామర్శించారు. అంత్యక్రియల్లో వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీటీడీ దేవస్థానం ఉద్యోగులు, టీటీడీ చైర్మన్ బంధువులు పాల్గొన్నారు.

Funeral of TTD EO son has ended
ముగిసిన తితిదే ఈవో కుమారుడి అంత్యక్రియలు
author img

By

Published : Dec 22, 2022, 5:20 PM IST

Chandramouli Reddy Funerals: గుండెపోటుకు గురై కన్నుమూసిన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళిరెడ్డి అంత్యక్రియలు నంద్యాల జిల్లా స్వగ్రామంలోని పారుమంచాలలో ముగిశాయి. ధర్మారెడ్డి కుటుంబ సభ్యులను సీఎం జగన్​ పరామర్శించారు. తితిదే ఛైర్మన్‌తో పాటు పలువురు ఉద్యోగులు, వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు నివాళులు అర్పించారు. చంద్రమౌళి రెడ్డి గత ఆదివారం గుండెనొప్పితో చెన్నెలోని కావేరి ఆస్పత్రిలో చేరగా మూడు రోజులు చికిత్స అనంతరం తుదిశ్వాస విడిచారు.

భౌతికకాయాన్ని ధర్మారెడ్డి సొంతూరైన పారుమాంచాలకు తరలించి అక్కడ వ్యవసాయ క్షేత్రంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ధర్మారెడ్డి కుటుంబ సభ్యులు చంద్రమౌళిరెడ్డి పార్దివదేహంపై పడి విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.