ETV Bharat / state

మత్స్యకారుల న్యూ కాన్సెప్ట్.. వినూత్న పద్దతిలో చేపల వేట

author img

By

Published : Feb 23, 2023, 2:43 PM IST

Catching fish in an innovative way: ట్రాక్టర్​తో ఎవరైనా ఏం చేస్తారు? పొలం దున్నుతారు.. లేదంటే సరుకు రవాణా చేస్తారు..! కానీ నంద్యాల జిల్లాలో.. కొందరు మత్స్యకారులు చేపల వేటకు వాడుతున్నారు.! కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తోందా.? చూస్తే భలే ఐడియా వేశారే అనిపిస్తుంది..! ఆ ఉపాయమేంటో చూద్దాం పదండి..

Catching fish in an innovative way
Catching fish in an innovative way

మత్య్సకారుల కొత్త కాన్సెప్ట్.. వినూత్న పద్దతిలో చేపల వేట

Catching fish in an innovative way: వారంతా మత్స్యకారులు. చేపలు పట్టటం వారి వృత్తి. కానీ.. అందరిలా పాత పద్ధతుల్లో కాకుండా.. వినూత్న రీతిలో చేపలు పడుతున్నారు. అతి సులువుగా చేపలు పడుతూ జీవనం సాగిస్తునన్నారు. చిన్న చేపనైనా పెద్ద వలతో పట్టేస్తుంటారు మత్స్యకారులు.! కానీ.. నంద్యాల జిల్లా పాణ్యం మండలం గోరుకల్లు జలాశయం వద్ద జాలరులు.. ఇంకా పెద్ద వలతో చేపలవేట సాగిస్తున్నారు. గోరుకల్లు జలాశయం నిర్మాణ సమయంలో చాలా మంది రైతులు భూములు కోల్పోయారు. . గ్రామంలో ఉన్న మత్స్యకారులు సైతం తమ భూములను త్యాగం చేయాల్సి వచ్చింది. దీంతో వారికి ఉపాధి కరువైంది. ఎంతో కాలంగా వ్యవసాయం చేస్తున్న జాలరి కుటుంబాలు.. చేపల వేటపై ఆధారపడ్డారు. జలాశయంలో సుమారు 10 టీఎంసీల నీరు ఉంటోంది. ఈ నీటిలోకి పుట్టితో వెళ్లి చేపలు పట్టటం ప్రమాదకరం. దీంతో.. జలాశయం నుంచి వెళ్లే ఎస్సార్బీసీ కాల్వలో చేపల వేట మొదలు పెట్టారు. అయినా చేపలు తప్పించుకుని పారిపోతుండటంతో సరికొత్త మార్గాన్ని అన్వేషించారు.

కాల్వలో ఒక్క చేప కూడా తప్పించుకోకుండా..3 లక్షల రూపాయలు వెచ్చించి భారీ వలను కొనుగోలు చేశారు. దీని వల్ల ప్రయోజనం చాలా ఉన్నా.. పెద్ద వలను లాగటం అంటే మాటలు విషయం కాదు. సుమారు 10 మంది జాలర్లు వలను తాడు సాయంతో లాగాల్సి ఉంటుంది. దీని కోసం చాలా కష్టపడాలి కూడా.. ప్రతి రోజూ ఎన్నోసార్లు ఇలా లాగటం వల్ల నీరసించిపోతున్నామని భావించిన మత్స్యకారులు.. ఓ ట్రాక్టర్​ను కొనుగోలు చేశారు. తాడును ట్రాక్టర్​కు కట్టేసి.. తేలిగ్గా లాగుతున్నారు. దీని వల్ల చాలా సులువుగా చేపలు పట్టగలుగుతున్నారు. ట్రాక్టర్​ను 60 వేల రూపాయలకు కొనుగోలు చేసినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. వినూత్న పద్ధతి ద్వారా ప్రతి రోజూ సుమారు వంద కేజీల వరకు చేపలు పడుతున్నారు. భారీ చేపలను సైతం చాలా సులువుగా పట్టుకుంటున్నారు.

60వేల రూపాయలతో ఒక పాత ట్రాక్టర్‌ కొన్నాము.. వలకు ఉన్న తాడును ట్రాక్టర్​కు కట్టేసి.. తేలిగ్గా లాగుతున్నాము. దీని వల్ల చేపల వేట సులువుగా ఉంటోంది. ఈ పద్ధతిలో.. రోజూ సుమారు వంద కిలోలవరకూ చేపలు సులువుగా పడుతున్నాము.- వెంకటరమణ, మత్స్యకారుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.