CM JAGAN INAUGURATE RAMCO INDUSTRY : పరిశ్రమలకు ప్రభుత్వం అన్నివిధాలా సాయపడుతుందని సీఎం జగన్ అన్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల వద్ద రామ్‌కో సిమెంట్ పరిశ్రమను సీఎం జగన్ ప్రారంభించారు. వరుసగా మూడో ఏడాది కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. రామ్‌కో పరిశ్రమతో స్థానికులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని.. రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్లకు సంబంధించి పనులు వేగంగా జరుగుతున్నాయని సీఎం జగన్ అన్నారు.
పారిశ్రామిక వృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తోంది. ఒక పరిశ్రమ వచ్చిందంటే అనేక ప్రయోజనాలు వస్తాయి.రామ్‌కో పరిశ్రమతో స్థానికులకు ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. పరిశ్రమలకు ప్రభుత్వం అన్నివిధాలుగా సహకారం అందిస్తోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా మూడో ఏడాది ప్రథమంగా ఉన్నాం. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే ప్రథమ స్థానంలో ఉంటున్నాం. -సీఎం జగన్
గ్రీన్‌కో ప్రాజెక్టులకు రైతులు సహకరించాలి: రాయలసీమలో రైతులు ముందుకొస్తే.. ఎకరానికి 30 వేల రూపాయలు చెల్లించేలా సోలార్ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటుందని సీఎం జగన్ అన్నారు. ప్రభుత్వమే ఈ భూములను లీజుకు తీసుకుని కంపెనీలకు ఇస్తుందని.. ఏటా 5 శాతం లీజు పెంచుతుందన్నారు. ఈ ప్రతిపాదనలకు రైతులను ఒప్పించేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని సీఎం జగన్.. పిలుపు ఇచ్చారు.
ఇవీ చదవండి: