ETV Bharat / state

criticism of YCP వైకాపా నాయకుల 'నాడు - నేడు' కబ్జాలే.! చంద్రబాబు

author img

By

Published : Sep 10, 2022, 2:50 PM IST

Updated : Sep 10, 2022, 5:04 PM IST

YCP leader నంద్యాల జిల్లా, పాణ్యం ఇందిరానగర్ లో ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల వైకాపా నేత ఇల్లుగా మారిన ఘటనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఇదిగిదిగో...వైకాపా ప్రభుత్వం 'నాడు - నేడు'! అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. విద్యార్థులు లేకపోతే వారిని బడికి రప్పించే కృషి చేయాల్సిన ప్రభుత్వం, పాఠశాల భవనాన్ని వైకాపా నేత కబ్జాకు వదిలెయ్యడాన్ని తప్పు పడుతూ చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

YCP leader s occupation of school
పాఠశాల కబ్జా

Nandyal District Panyam school: నంద్యాల జిల్లా పాణ్యం పట్టణంలోని ఇందిరానగర్​లో మూతపడిన పాఠశాల భవనాన్ని వైసీపీ నేత ఇంటిగా మార్చేశారు. 2013 లో 5.3 లక్షలతో ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలను నిర్మించింది. విద్యార్థులు సంఖ్య క్రమంగా తగ్గిపోతుండటంతో, ఉన్న విద్యార్థులను వేరే పాఠశాలకు తరలించారు. గిరిజన పాఠశాలను ఐదేళ్ల క్రితం మూసివేశారు. మూసిన పాఠశాలపై స్థానిక వైకాపా నేత కన్నుపడింది. శిలాఫలం, నల్ల బోర్డు తొలగించి.. వంటగది, బెడ్ రూమ్ ఏర్పాటు చేసుకొని తన ఇంటిగా మార్చుకున్నాడు. ఈ విషయం తెలిసినా అధికారులు పట్టించుకోకపోవటంతో, తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. వైకాపా ప్రభుత్వం నాడు-నేడు ఇలానే ఉంటోందంటూ, వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

  • ఇదిగిదిగో... వైసీపీ ప్రభుత్వ నాడు - నేడు! pic.twitter.com/c1Lskc3jUG

    — N Chandrababu Naidu (@ncbn) September 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="

ఇదిగిదిగో... వైసీపీ ప్రభుత్వ నాడు - నేడు! pic.twitter.com/c1Lskc3jUG

— N Chandrababu Naidu (@ncbn) September 10, 2022 ">
పాఠశాల కబ్జా

ఇవీ చదవండి:

Nandyal District Panyam school: నంద్యాల జిల్లా పాణ్యం పట్టణంలోని ఇందిరానగర్​లో మూతపడిన పాఠశాల భవనాన్ని వైసీపీ నేత ఇంటిగా మార్చేశారు. 2013 లో 5.3 లక్షలతో ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలను నిర్మించింది. విద్యార్థులు సంఖ్య క్రమంగా తగ్గిపోతుండటంతో, ఉన్న విద్యార్థులను వేరే పాఠశాలకు తరలించారు. గిరిజన పాఠశాలను ఐదేళ్ల క్రితం మూసివేశారు. మూసిన పాఠశాలపై స్థానిక వైకాపా నేత కన్నుపడింది. శిలాఫలం, నల్ల బోర్డు తొలగించి.. వంటగది, బెడ్ రూమ్ ఏర్పాటు చేసుకొని తన ఇంటిగా మార్చుకున్నాడు. ఈ విషయం తెలిసినా అధికారులు పట్టించుకోకపోవటంతో, తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. వైకాపా ప్రభుత్వం నాడు-నేడు ఇలానే ఉంటోందంటూ, వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

పాఠశాల కబ్జా

ఇవీ చదవండి:

Last Updated : Sep 10, 2022, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.