CBN Fan Padayatra on Chandrababu Illegal Arrest: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టును ఖండిస్తూ.. గతకొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వెలువెత్తుతున్న విషయం తెలిసిందే. తాజాగా 'బాబు కోసం మేము సైతం' పేరుతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు కదం తొక్కారు. రిలే నిరాహార దీక్షలు, ర్యాలీలతో పాటు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలపై నినాదాలు చేస్తూ.. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు అభిమాని చింతల నారాయణ.. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ.. తన గ్రామం నుంచి రాజమహేంద్రవరం వరకూ పాదయాత్ర చేపట్టారు. తన వృద్ధాప్యాన్ని లెక్కచేయకుండా చంద్రబాబు విడుదలయ్యే వరకూ నడుస్తూనే ఉంటానని తన అభిమానాన్ని చాటి చెప్తున్నారు.
CBN Fan Chintala Narayana Padayatra: నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం చినదేవళాపురానికి చెందిన చింతల నారాయణ ఓ నిరుపేద కూలీ. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. మేదర వృత్తి చేసుకునే నారాయణ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్నా, చంద్రబాబు నాయుడు అన్నా అపారమైన అభిమానం. సుమారు 70 సంవత్సరాల వయసు గల నారాయణ.. చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఆగ్రహించారు.
TDP Protests in Hyderabad : చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా.. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో దీక్ష
Me with Chandrababu: చంద్రబాబు అరెస్టు అయిన దగ్గర నుంచీ ఆయన తిండి, నిద్ర మానేసి కుమిలిపోయాడు. చంద్రన్నకు మద్దతుగా తానేమయినా చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా ఒంటిరిగా తన గ్రామం నుంచి రాజమండ్రి వరకూ పాదయాత్ర ప్రారంభించాడు. అతని పాదయాత్రకు కుటుంబ సభ్యులు అండగా నిలవడంతో గత ఆదివారం ఉదయం పాదయాత్ర ప్రారంభించాడు. 'సత్యమేవ జయతే.. బాబుతో నేను' అంటూ ఓ ఫ్లెక్సీ వేసుకొని ఎండలో నడుస్తున్నాడు. రోజుకు దాదాపు 30 కిలో మీటర్ల దూరం నడుస్తూ.. తన అభిమానాన్ని చాటుకుంటున్నాడు.
Chintala Narayana Comments: ఈ క్రమంలో కొంతమంది వైఎస్సార్సీపీ నాయకులు నిరసన వద్దని, తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని బెదిరించినా.. నారాయణ భయపడకుండా ముందుకు సాగిపోతున్నారు. రాజమండ్రికి చేరుకొని చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలుపుతానని చెబుతున్నారు. ఇప్పటికే కర్నూలు, ప్రకాశం జిల్లాలు దాటి గుంటూరు జిల్లా చేరుకున్నారు.
TDP Motha Mogiddam Program Telangana : చంద్రబాబు నాయుడుకు మద్దతుగా తెలంగాణలో 'మోత మోగింది'
నారా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఎలాంటి అవినీతి మచ్చపడని నాయకుడు ఆయన. ఏ అధికారం లేనివారు ప్రస్తుతం లక్షల కోట్ల అవినీతి చేస్తున్నారు. అలాంటిది చంద్రబాబు రూ.2కోట్ల అవినీతికి పాల్పడ్డారని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని నేను నమ్మాను, ఈ రాష్ట్ర ప్రజలు నమ్మారు. ఎందుకంటే ఆయన తప్పు చేయరు.- చింతల నారాయణ, చంద్రబాబు అభిమాని