ACB RAIDS AT NANDYALA : నంద్యాలలో అవినీతి నిరోధకశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. నీటిపారుదల శాఖలో ఏఈగా పనిచేస్తున్న చంద్రుడు ఇంట్లో సోదారు జరిపారు. చంద్రుడి బంధువుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఎస్సార్బీసీలో ఏఈగా పనిచేస్తున్న చంద్రుడు ఆదాయానికి మించిన అస్తులు కలిగి ఉన్నాయని సమాచారంతో దాడులు చేశారు. కర్నూలు ఏసీబీ... డీఎస్పీ శివ నారాయణ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. నంద్యాల, కోవెలకుంట్లతో పాటు మరి కొన్ని చోట్ల సోదాలు చేస్తున్నారు.
ఇవీ చదవండి: