కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో వైకాపా నాయకుడు దారుణహత్యకు గురయ్యాడు. పట్టణ శివారులోని పొన్నాపురం గ్రామానికి చెందిన నాగ సుబ్బరాయుడును గుర్తు తెలియని వ్యక్తులు కట్టెలతో కొట్టి హతమార్చారు. నంద్యాల నుంచి చాబోలు వెళ్లే రహదారిపై ఉదయం వాకింగ్ చేస్తుండగా హత్య చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హతుడు నాగ సుబ్బరాయుడు న్యాయవాదిగానూ పని చేస్తున్నారు.
![ysrcp leader killed at nandhyala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-knl-22-09-murder-av-ap10058_09102020085950_0910f_00182_708.jpg)
ఇదీ చదవండి: న్యాయవ్యవస్థపై యుద్ధం ప్రకటించారా..? : హైకోర్టు