కర్నూలు జిల్లా గడివేముల మండలంలోని సోమాపురం గ్రామంలో వాహబ్ 30 అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం రాత్రి ఇంట్లో నిద్ర పోతుండగా గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిద్రపోతున్న సమయంలో కత్తులతో తీవ్రంగా దాడి చేసి హతమార్చినట్లు ఎస్ఐ చిరంజీవి వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
.