రూ. 148 కోట్లతో నిర్మించనున్న శాశ్వత తాగునీటి పథకానికి ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి భూమి పూజ నిర్వహించారు. కర్నూలులోని ఎమ్మిగనూరు పట్టణంలో ప్రస్తుతానికున్న నీటి ట్యాంక్ 20 వేల మందికి మాత్రమే సరిపోతుందని ఆయన తెలిపారు. జనాభా లక్షా ఇరవై వేలకు చేరడంతో పలు కాలనీల్లో నీటి సమస్య తలెత్తిందని పేర్కొన్నారు.
పట్టణంలో పెరిగిన జానాభాకు సరిపడా తాగునీరు అందించలేక పోతున్నామని ఎమ్మెల్యే వివరించారు. ఈ పథకం అందుబాటులోకి వస్తే.. మరో యాభై ఏళ్ల వరకు నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉండదని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: శ్రీశైలానికి కొనసాగుతున్న వరద.. 5 గేట్లు ఎత్తివేత