ATTACK: కర్నూలు జిల్లా వెల్దుర్తిలో వైకాపా నాయకులు రెచ్చిపోయారు. ఏకంగా ఓ కాలనీ రహదారికి అడ్డంగా గోడను కట్టారు. అడ్డుకున్న వారిపై రాళ్ల దాడి చేసి మరీ పంతం నెగ్గించుకున్నారు. ఈ ఘటనలో.. 10 మందికి గాయాలయ్యాయి. వైకాపా అరాచకాలకు ఇదే పరాకాష్టని.. లోకేశ్ మండిపడ్డారు.
వెల్దుర్తి అనకల వీధి వాసులపై వైకాపా వర్గీయుల రాళ్ల దాడి ఇది. ఈ వీధిలో నుంచి ప్రధాన రహదారికి వెళ్లే రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మిస్తుంటే కాలనీ వాసులు అడ్డుకున్నారు. వారిపై వైకాపాకు చెందిన షమీర్ రెడ్డి అనుచరులు రాళ్లు, ఇటుకలు, సీసాలతో దాడి చేశారు. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. వీరిలో 8 మంది మహిళలు ఉన్నారు. కొందరు చిన్నారులకూ స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు.
షమీర్ రెడ్డికి చెందిన కాంప్లెక్స్ పక్కనున్న రోడ్డు నుంచి తమను వెళ్లనీయడంలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీకి రోడ్డు లేదంటూ పలు మార్లు గోడ నిర్మించేందుకు యత్నించారని వాపోయారు. ఇదే విషయంపై గతంలో ఘర్షణలు జరిగాయన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇటీవల స్థానికులు ఫిర్యాదు చేయగా.. ఎవరూ ఎలాంటి నిర్మాణాలు చేయరాదని పంచాయతీ కార్యదర్శి తీర్మానం చేశారు. అయినా లెక్కచేయని షమీర్ రెడ్డి తన అనుచరులతో గోడ కట్టేందుకు యత్నించారు. అడ్డుకునేందుకు యత్నించిన తమపై దాడి చేశారని వాపోయారు.
దాడి అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని.. స్థానికులను నిలువరించారు. ఆ తర్వాత వైకాపా నేతలు గోడ నిర్మాణం పూర్తి చేశారు. వైకాపా అరాచకాలకు వెల్దుర్తి ఘటన పరాకాష్ట అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. మహిళలు, పిల్లలని చూడకుండా సీసాలు, రాళ్లతో దాడి చేయడం వాళ్ల వైకాపా ప్రవృత్తికి నిదర్శనమని దుయ్యబట్టారు. నలుగురు నడిచే రోడ్డుకు అడ్డంగా గోడ కట్టడమేంటని ఒక్క వైకాపా నేత అయినా షమీర్ రెడ్డిని ప్రశ్నించారా అని నిలదీశారు. సినిమాల్లో విలన్ల మాదిరిగా వైకాపా నేతలు రెచ్చిపోతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం దౌర్భాగ్యమన్నారు.
-
నలుగురు నడిచే రోడ్డుకడ్డంగా గోడ కట్టడమేంట్రా గాడిదా అని ఒక్క వైసీపీ నేతయినా సమీర్ రెడ్డికి గడ్డి పెట్టగలరా? సినిమాల్లో విలన్ల మాదిరి వైసీపీ నేతలు రెచ్చిపోతుంటే.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం మన దౌర్భాగ్యం.
— Lokesh Nara (@naralokesh) June 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">నలుగురు నడిచే రోడ్డుకడ్డంగా గోడ కట్టడమేంట్రా గాడిదా అని ఒక్క వైసీపీ నేతయినా సమీర్ రెడ్డికి గడ్డి పెట్టగలరా? సినిమాల్లో విలన్ల మాదిరి వైసీపీ నేతలు రెచ్చిపోతుంటే.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం మన దౌర్భాగ్యం.
— Lokesh Nara (@naralokesh) June 1, 2022నలుగురు నడిచే రోడ్డుకడ్డంగా గోడ కట్టడమేంట్రా గాడిదా అని ఒక్క వైసీపీ నేతయినా సమీర్ రెడ్డికి గడ్డి పెట్టగలరా? సినిమాల్లో విలన్ల మాదిరి వైసీపీ నేతలు రెచ్చిపోతుంటే.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం మన దౌర్భాగ్యం.
— Lokesh Nara (@naralokesh) June 1, 2022
ఇవీ చదవండి: