ETV Bharat / state

పోలీస్ స్టేషన్ వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం

కర్నూలు జిల్లా రుద్రవరం పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వ్యక్తితో ఖాళీ స్థలంలో గొడవ జరగగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు పట్టించుకోకపోవడం మనస్థాపానికి గురైన మహిళ పోలీస్​ స్టేషన్​ ఎదుట పురుగులు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.

Woman attempts suicide at police station
పోలీస్ స్టేషన్ వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం
author img

By

Published : May 29, 2020, 7:22 AM IST

కర్నూలు జిల్లా రుద్రవరం పోలీస్ స్టేషన్ వద్ద రత్నమ్మ అనే మహిళ పోలీస్​ స్టేషన్​ ఎదుట ద్రావకం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆలమూరు గ్రామానికి చెందిన మహిళపై అదే గ్రామానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి ఖాళీ స్థలంలో నిర్మాణం విషయంపై గొడవకు దిగాడు. అక్కడితో ఆగిపోకుండా ఆమెపై దాడికి దిగాడు. ఈ ఘటనపై ఆమె రుద్రవరం పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా పోలీసులు స్పందించకుండా నిందితుడుకు మద్దతుగా నిలిచారని ఆవేదన చెందుతూ తన వెంట తెచ్చుకున్న ద్రావకాన్ని తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అప్రమత్తమైన పోలీసులు ఆమెను వెంటనే ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

ఈ ఘటనపై ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం సదరు మహిళ గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయ స్థలంలో మరుగుదొడ్డి నిర్మించేందుకు యత్నించగా సుధాకర్ అడ్డుకున్నాడని, ఆ సమయంలో సుధాకర్​ని పుల్లమ్మ బెదిరించిందని తెలిపారు. పోలీస్ స్టేషన్ వద్ద సైతం ఆత్మహత్యాయత్నం నాటకం ఆడిందని, అందుకే ఆమెపై 447, 506 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.

ఇవీ చూడండి...

కర్నూలు బాలిక హత్య కేసు దర్యాప్తులో పురోగతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.