సంస్థను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కర్నూలు జిల్లా నంద్యాల విజయ డెయిరీ ఎండీ తెలిపారు. గత ఏడాది కంటి ఈసారి అధికంగా పాల సేకరణ, పాల అమ్మకాలు జరిపేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. కర్నూలు జిల్లా పాల ఉత్పత్తి దారుల పరస్పర సహాయక సహకార సమితి మేనేజింగ్ డైరెక్టరు ప్రసాదరెడ్డి ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. సంస్థ అభివృద్ధికి పాటుపడే పాడి రైతులకు రైతులకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామన్నారు. నాణ్యమైన పాలు.. పాల పదార్థాలు అందివ్వడం తమ లక్ష్యమని ఆయన అన్నారు. 2019-20 పాలసేకరణ వివరాలతో పాటుగా..2021-22 కేటాయింపులు వెల్లడించారు.
* 2019-20 పాల సేకరణ 222 లక్షల లీటర్లు, పాల అమ్మకాలు 292 లక్షల లీటర్లు, టర్నోవర్ రూ.185 కోట్లు, పాడి రైతులపై ఖర్చు చేసిన మొత్తం రూ. 34.94 లక్షలు.
* 2021-22 లో పాలసేకరణ 226 లక్షల లీటర్లు, పాల అమ్మకాలు 309 లక్షల లీటర్లు, రైతులపై ఖర్చు చేయబోయే మొత్తం రూ.86.67 లక్షల కేటాయింపు.
ఇవీ చదవండి: