ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయం నిండిపోయింది. ఇప్పటికే జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు కర్నూలు జిల్లాలోని సుంకేసుల జలాశయం సైతం నిండుకుండలా మారింది. తుంగభద్ర జలాశయం నుంచి మరింత వరద వస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను కర్నూలు కలెక్టర్ వీరపాండియన్ ఆదేశించారు. సుంకేసులను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
ఇదీ చదవండి