ETV Bharat / state

కృష్ణమ్మ పరవళ్లు..నిండుకుండలా ప్రాజెక్టులు - నాగార్జునసాగర్​ తాాజా వార్తలు

ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో రాష్ట్రంలో కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. కృష్ణా బేసిన్​లోని ఆల్మట్టి, నారాయణపూర్​ జలాశయాలు నిండుకుండల్లా కనిపిస్తుండగా.. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, తుంగభద్ర, పులిచింతల​ జలాశయాలు పూర్తిగా నిండాయి.

water levels are filled in krishna basin
వరదనీరుతో పూర్తిగా నిండిన జలాశయాలు
author img

By

Published : Aug 25, 2020, 9:03 PM IST

ఆల్మట్టి..
ఆల్మట్టి జలాశయం పూర్తి నీటిమట్టం 1705 అడుగులు కాగా... ప్రస్తుత 1704.59 అడుగులకు మేర నీళ్లు ఉన్నాయి. రిజర్వాయర్​ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 127.47 టీఎంసీలుగా ఉంది. ఇన్​ఫ్లో 1,91,922 క్యూసెక్కులు నీరు జలాశయానికి వస్తోంది. ఔట్​ఫ్లో 1,01,922 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.

నారాయణపూర్​..
నారాయణపూర్​ జలాశయం పూర్తి నీటి మట్టం 1615 అడుగులు ఉండగా... ప్రస్తుతం 1612.83 అడుగుల మేర చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 34.65 టీఎంసీలుగా నమోదైంది. ఇన్​ఫ్లో 1,11,870 క్సూసెక్కుల వరద నీరు వచ్చి చేరగా.. ఔట్​ఫ్లో 88,884 క్యూసెక్కులు నీరు విడుదలవుతోంది.

జూరాల..
జూరాల జలాశయంలో ప్రస్తుతం నీటిమట్టం 1044.06 అడుగులకు చేరింది. రిజర్వాయర్​ నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 9.07 టీఎంసీలుగా ఉంది. ఇన్​ఫ్లో 1,35,669 క్యూసెక్కుల నీరు జలాశయానికి వస్తుండగా.. ఔట్​ఫ్లో 1,27,417 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది.

శ్రీశైలం..
ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం సామర్థ్యం 210.994 టీఎంసీలుగా కొనసాగుతోంది. కుడిగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు 30,986 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులరేటర్‌కు 35వేల క్యూసెక్కులు... హంద్రీనీవాకు 202 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

తుంగభద్ర..
తుంగభద్ర జలాశయం పూర్తి నీటిమట్టం 1632.91 అడుగులకు చేరింది. జలాశయం నీటి సామర్థ్యం 100.51 టీఎంసీలుగా ప్రస్తుతం నీటినిల్వ కొనసాగుతోంది. రిజర్వాయర్​ నుంచి ఇన్​ఫ్లో 33,186 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతోంది.

నాగార్జునసాగర్​..
నాగార్జునసాగర్​ జలాశయం పూర్తిగా నిండింది. ప్రస్తుత నీటిమట్టం 587.70 అడుగుల మేర జలాశయంలో నీళ్లు ఉన్నాయి. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 312.05టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 305.92 టీఎంసీలుగా ఉంది. జలాశయానికి ప్రస్తుతం ఇన్​ఫ్లో 91,050 క్యూసెక్కులుగా ఉంది.

పులిచింతల..
పులిచింతల జలాశయం నిండుకుండను తలపిస్తోంది. పూర్తి సామర్థ్యం 55.77టీఎంసీలు కాగా... ఉదయం ప్రాజెక్టు నిండిపోయింది. ఎగువ నుంచి ప్రస్తుతం 30వేల క్యూసెక్కులు మాత్రమే వరదనీరు వస్తోంది. దీంతో ఒక గేటు ఎత్తి 17వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. మరో 15వేల క్యూసెక్కుల నీటిని జలవిద్యుత్ కేంద్రానికి మళ్లించారు. పైనుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని బట్టి ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టాలు ఉండేలా చూస్తూ.. మిగతా నీటిని విద్యుత్ ఉత్పత్తికి వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. అంతకుమించి వరద ఉంటే గేట్ల ద్వారా బయటకు పంపేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చదవండి :

ఆగని వరద.. నిండుకుండలా మారిన జలాశయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.