కర్నూలు జిల్లా కోడుమూరులో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ ప్రజలు రోడ్డెక్కారు. మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. 20 రోజులుగా నీళ్లు రాకపోవడంతో అవస్థలు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు - బళ్లారి ప్రధాన రహదారిపై కోడుమూరు అభివృద్ధి కమిటీ, తాగునీటి సాధన కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. నిరసన విరమించాలని కోరిన గాజులదిన్నె ప్రాజెక్ట్ అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రహదారిపై వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు అవస్థలు పడ్డారు.
ఇదీ చదవండి