కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సంకల్‌భాగ్ హరిహరక్షేత్రంలో వెంకటేశ్వరస్వామి కల్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, జిల్లా తెదేపా ఇంచార్జి టీజీ భరత్‌లు సతీసమేతంగా పాల్గొన్నారు. ఆలయలంలో పది రోజుల పాటు బ్రహ్మోత్సవం, కళ్యాణోత్సవం, చక్రస్నానం చేయటం ఆనవాయితీగా వస్తుందని టీజీ వెంకటేష్ అన్నారు.
గరుడ పక్షి ప్రదక్షిణలు:
బ్రహ్మోత్సవంలో భాగంగా యాగం చేసే సమయంలో వెంకటేశ్వరస్వామి వాహనమైన గరుడపక్షి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుందని ఎంపీ తెలిపారు. స్వామి చక్రస్నానంలో కూడా గరుడపక్షి వచ్చి ఇక్కడ ప్రదక్షిణలు చేస్తుందన్నారు. కర్నూలు ప్రజలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరూ ఈ శుభకార్యంలో పాల్గొనాలని కోరారు. ఇలాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా జరగదన్నారు.
ఇదీ చదవండి