కర్నూలు జిల్లా డోన్ మండలం ఓబులాపురం వద్ద... బీటీ రోడ్డుకు సంబంధించిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. జాతీయ రహదారి నుంచి ఓబులాపురం మీదుగా ఎద్దు పెంట వరకు తెదేపా ప్రభుత్వంలో బీటీ రోడ్డు వేశారు. ఈ రోడ్డుకి సంబంధించిన శిలాఫలకాన్ని జాతీయ రహదారి పక్కన నిర్మించారు. శనివారం రాత్రి కొందరు వ్యక్తులు ఈ శిలాఫలకాన్ని పగలగొట్టారు. వైకాపాకు చెందిన వ్యక్తులే ఈ పని చేసి ఉంటారని డోన్ గ్రామీణ పోలీసు స్టేషన్లో తెదేపా నాయకులు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి:రోడ్డు ప్రమాదాలపై న్యాయవాదుల అవగాహన