ETV Bharat / state

విద్యుదాఘాతం.. ఇద్దురు యువకులు దుర్మరణం - kurnool today latest news

కర్నూలు, విశాఖపట్నంలో జరిగిన ఘటనల్లో ఇద్దరు యువకులు విద్యుదాఘాతంతో మరణించారు.

Two young men die of electrocution
విద్యుదాఘాతంతో ఇద్దురు యువకులు దుర్మరణం
author img

By

Published : Jun 4, 2020, 1:23 AM IST

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్లలో విద్యుదాఘాతంతో నరసింహ (16) విద్యార్థి మృతి చెందాడు. నల్లగొండ గ్రామానికి చెందిన చిన్న సుబ్బయ్యకు చెందిన ఒక్కగానొక్క కుమారుడు నరసింహ... ఆళ్లగడ్డ పట్టణంలో పదో తరగతి చదివాడు. లాక్​డౌన్ కారణంగా స్వగ్రామానికి వచ్చిన నరసింహ.. పని మీద బయటకు వచ్చి ఇంటికి తిరిగి వెళ్తుండగా విద్యుత్ తీగ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ఆళ్లగడ్డలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

విశాఖపట్నం జిల్లా కె.కోటపాడు మండలం కొరువాడలో ఆంజనేయస్వామి గుడి వద్ద విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందాడు. గుడిపైన శుభ్రం చేస్తుండగా కొల్లి రాజు (33) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న విద్యుత్ తీగలు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు తక్షణమే కె.కోటపాడులోని పీహెచ్​సీకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఏ.కోడూరు ఎస్ఐ సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి:

వీధి కుక్కల దాడిలో...నాలుగేళ్ల బాలుడు మృతి...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.