కర్నూలు జిల్లాలో పసుపు కొనుగోళ్లు తాత్కాలికంగా నిలిచిపోయాయి. కొనుగోలు కేంద్రానికి పసుపు తెచ్చిన వారిలో కొందరు దళారులు ఉన్నారని భావించిన ప్రభుత్వం... ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
కొనుగోలు నిలిపిన అధికారులు గ్రామస్థాయిలో విచారణ చేపట్టారు. గ్రామంలో పసుపు సాగు చేసిన రైతుల వివరాలను సేకరిస్తున్నారు.
గత నెల 14న పసుపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు ప్రారంభించారు. అయితే కొంతమంది రైతుల పేర్లు ఈ క్రాప్ లో నమోదు కాలేదు. పలు సార్లు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని రైతులు వాపోయారు.
దీంతో కొనుగోళ్లను ప్రస్తుతానికి ఆపి మళ్లీ రైతుల పేర్లు నమోదు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని విచారణ అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: సున్నిపెంట అభివృద్ధిపై జేసీ సమీక్ష