ETV Bharat / state

తుంగభద్ర పుష్కరాలు 2020: రెండో రోజు

author img

By

Published : Nov 22, 2020, 7:56 AM IST

తుంగభద్ర పుష్కరాలు కొనసాగుతున్నాయి. రెండోరోజు పరిమతంగానే భక్తులు వచ్చారు. నదిలో నీరు లేకపోవడంతో జల్లు స్నానాలు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం చెబుతున్నా... క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. విధుల్లో ఉన్న ఓ హోంగార్డుకు కరోనా సోకడం ఆందోళన కలిగించింది.

తుంగభద్ర పుష్కరాలు 2020: రెండో రోజు
తుంగభద్ర పుష్కరాలు 2020: రెండో రోజు
తుంగభద్ర పుష్కరాలు 2020: రెండో రోజు

తుంగభద్ర పుష్కరాల్లో రెండో రోజు భక్తుల సంఖ్య పెద్దగా కనిపించలేదు. కర్నూలు సంకల్‌బాగ్, మంత్రాలయం ఘాట్లలో అక్కడక్కడా భక్తులు కనిపించినా... మిగిలిన ఘాట్లన్నీ వెలవెలబోయాయి. కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని... ప్రభుత్వం హెచ్చరిస్తున్నా... చాలా మంది భక్తులు పెద్దగా పట్టించుకోవడం లేదు. కొందరు మాత్రమే శరీర ఉష్ణోగ్రత పరీక్షించుకుంటున్నారు. చాలా మంది మాస్కులు లేకుండా వస్తుండటం, భౌతికదూరం పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నగరేశ్వర స్వామి ఘాట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ హోంగార్డుకు కరోనా సోకడం అలజడి రేపినా.... సహచరులకు నెగటివ్ రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం లేకపోవటంతో... పిండ ప్రదానాలు చేసిన తర్వాత పూజాసామగ్రిని నదిలో వదలడం భక్తులకు ఇబ్బందిగా మారింది. పలు ఘాట్లలో ఏర్పాటుచేసిన జల్లు స్నానాల్లోనే... భక్తులు స్నానమాచరించి వెనుదిరుగుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నదీ స్నానాలకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.

సంకల్ బాగ్ పుష్కర ఘాట్‌లో వేదపండితులు తుంగభద్రమ్మకు పంచ హారతులు ఇచ్చారు. భక్తులు పాల్గొని తన్మయత్వం పొందారు.

ఇదీ చదవండి: కేంద్రం ఇస్తానన్న రూ.20,398 కోట్లకు.. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆమోదం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.