ETV Bharat / state

తుంగభద్ర పుష్కరాల్లో.. పురోహితులెవరు? - తుంగభద్ర పుష్కరాలు న్యూస్

తుంగభద్ర పుష్కరాలకు వచ్చే భక్తులకు పిండ ప్రదానం వంటి కార్యక్రమాలకు పురోహితులెవరనే దానిపై అర్హులకు గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. వచ్చిన దరఖాస్తులను బట్టి కార్డులను దేవాదాయశాఖ సిద్ధం చేసి పెట్టుకోనుంది. తుంగభద్ర పుష్కరాలకు మూడు రోజుల ముందు అంటే 17న పురోహితులకు జారీ చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. అయితే అర్హత గల పురోహితులు కరోనా పరీక్షలు చేయించుకుని నెగిటివ్‌ రిపోర్టు చూపించిన వారికే గుర్తింపు కార్డులు ఇస్తామన్న నిబంధన పెట్టారు.

పుష్కరాల్లో.. పురోహితులెవరు?
పుష్కరాల్లో.. పురోహితులెవరు?
author img

By

Published : Nov 11, 2020, 5:03 PM IST

కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదీ తీరంలో మొత్తం కొత్తవి 21 ఘాట్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇవిగాక పాత ఘాట్లు మరికొన్ని ఉన్నాయి. ఒక్కో ఘాట్‌ వద్ద 2008 పుష్కరాలకు 20 మంది పురోహితులకు అనుమతిచ్చారు. ఈ నెలలో జరిగే పుష్కరాలకు ఒక్కో ఘాట్‌కు 15 మందికి అనుమతిచ్చి గుర్తింపు కార్డులు ఇచ్చేలా జిల్లా సర్వోన్నతాధికారి వీరపాండియన్‌ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. గుర్తింపు కార్డుల కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి 30 మంది, ఆంధ్రప్రదేశ్‌లోని 340 మంది దరఖాస్తు చేసుకున్నట్లు దేవాదాయశాఖ కమిషనర్‌ ఆదిశేషనాయుడు తెలిపారు.

పుష్కరాల్లో వేద పండితులతో యాగశాలలో హోమం చేయించేందుకు దేవాదాయశాఖ నిర్ణయించింది. ఇప్పటికే హోమాలకు సంబంధించి పూజా సామగ్రికి టెండర్లు పూర్తయ్యాయి. అలాగే యాగశాలను నిర్మించడానికి ఇంజినీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వెదురు కర్రలతో చేపట్టే ఈ నిర్మాణానికి ఈ నెల 11న కొటేషన్లకు గడువు తేదీగా ప్రకటించారు. ఇది సంకల్‌బాగ్‌ ఘాట్‌ వద్ద నిర్మించాలన్న ఆలోచనలో అధికారులున్నారు. యాగశాలలో 12 మంది వేద పండితులు పాల్గొంటారు. హోమాలు చేశాక సాయంత్రం వేళల్లో హారతులిచ్చే కార్యక్రమంలో వీరు పాల్గొంటారు. పుష్కరాల్లో చివరి రోజున పుర్ణాహుతికి ఏర్పాటు చేస్తున్నారు.

తొలి రోజు పుష్కరాలు గణపతి పూజ, పుణ్యహవాచనం, కనకదారణ, కలశస్థాపన, పుష్కర గంగా మాత విగ్రహ పూజ, నవగ్రహ, నక్షత్రమండల, శివలింగ, విష్ణుబ్రహ్మదేవతల ఆవాహన పూజలు నిర్వహిస్తారు. ప్రతిరోజూ సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత 6.30-7గంటల మధ్య గంగా హారతి ప్రధాన ఘాట్లలో చేపట్టనున్నారు. 21న మృత్యుంజయ హోమం, 22న సూర్యనారాయణ, 23న రుద్ర, 24న శ్రీహనుమాన్, 25న విష్ణు, 26న దత్తాత్రేయ, 27న గంగాహోమ పూజ, 28న వెంకటేశ్వరస్వామి, 29న లలిత సహస్త్రనామ, 30న మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, డిసెంబరు 1న ఆయుష్యహోమం నిర్వహించనున్నారు. ఈ హోమాలు ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు పదకొండు రోజులు నిర్వహిస్తారు.

ఇదీ చదవండి: క్రికెట్ బెట్టింగ్​లో నష్టం..ఇద్దరి ఆత్మహత్యాయత్నం.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.