కర్నూలు జిల్లా డోన్ రైల్వేస్టేషన్లో కర్నూలు నుంచి గుంతకల్లు వెళ్లే ప్యాసింజర్ రైలును రద్దు చేయటంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. రైల్వే స్టేషన్ ముందు పట్టాలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ప్రయాణికులంతా కసాపురం ఆంజనేయస్వామి దర్శనం కోసం కర్నూలు నుండి గుంతకల్లు వెళ్తుండగా మార్గమధ్యలో రైల్వే అధికారులు రైళ్లును రద్దు చేశారు. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు రైల్వే అధికార్లపై మండిపడ్డారు. ముందస్తు సమాచారం లేకుండా రైళ్లను ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు. గుంతకల్లు సమీపంలో రైల్వే డబల్ లైన్ పనులు జరగుతున్నాయనీ అందుకే రైలును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు అంటున్నారు.
ఇదీ చదవండి : కుందూనది ఉద్ధృతి.. ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు