కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని వెంకటగిరిలో ప్రమాదవశాత్తు మూడు గడ్డివాములు దగ్దమయ్యాయి. గ్రామ శివారులో ఉన్న ఉరుకుందు, నరసింహులు, తిక్కన అనే రైతులకు చెందిన గడ్డివాములు అగ్నికి ఆహుతి అయ్యాయి.
అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దాదాపు లక్ష రూపాయలు నష్టం జరిగినట్లు రైతులు పేర్కొన్నారు. గడ్డివాముల సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద నిప్పులు వచ్చిన నిప్పులతోనే ప్రమాదం జరిగినట్లు రైతులు చెప్పారు.
ఇవీ చదవండి: