ETV Bharat / state

'పొలాలు మునుగుతున్నాయి.. కుందూ నది ప్రవాహాన్ని నియంత్రించండి' - farmers protest in nandyal news

కుందూ నదికి వరద ఉద్ధృతి పెరగటం వల్ల పొలాలు మునిగిపోయి తీవ్రంగా నష్టపోతున్నామని కర్నూలు జిల్లాలోని తొగర్చేడు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎగువ ప్రాజెక్టుల నుంచి సామర్థ్యానికి మించి నీటిని నదికి విడుదల చేయడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని అన్నారు.

thogarchedu farmers protest at sub collector office in nandyal

author img

By

Published : Aug 22, 2020, 6:32 PM IST

కుందూ నదిలో నీటి ప్రవాహాన్ని తగ్గించాలంటూ కర్నూలు జిల్లా నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆ నది పరివాహక గ్రామాల్లో ఒకటైన తొగర్చేడుకు చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందు వల్ల పొలాలు మునిగిపోతున్నాయని ఆవేదన చెందారు.

ఎగువ ప్రాజెక్టుల నుంచి సామర్థ్యానికి మించి నీటిని విడుదల చేస్తున్నారని రైతులు అన్నారు. ప్రస్తుతం కుందూ నదిలో ఇరవై వేల కూసెక్కులకు పైగా నీటి ప్రవాహం కొనసాగుతోందని చెప్పారు. పై నుంచి నీటి విడుదల నియంత్రించి.. తమ పొలాలు కాపాడాలని అధికారులను కోరారు.

ఇదీ చదవండి:

ఇంజినీరింగ్‌ అద్భుతం శ్రీశైలం ప్రాజెక్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.