కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలో దొంగలు చెలరేగిపోయారు. సిరివెళ్ల మండలంలోని ఎర్రగుంట్ల, వెంకటాపురం, ఆళ్లగడ్డ మండలంలోని బత్తలూరు గ్రామాల్లోని మూడు ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డారు. దాదాపు పది కేజీల వెండి, రెండు తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు సిరివెళ్ల ఎస్సై సూర్యమౌళి చోరీ జరిగిన ఆలయాలను పరిశీలించి విచారణ ప్రారంభించారు. దొంగల కదలికలకు సంబంధించిన దృశ్యాలు ఒక ఆలయంలోని సీసీ ఫుటేజీలో లభించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి